Sitaram Yechury : ఎయిమ్స్‌కు విరాళంగా ఏచూరి పార్థివ దేహం.. దేహ దానం నియమాలు ఏgటో తెలుసా.?

కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు.

Update: 2024-09-13 08:06 GMT

కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయ‌న‌ ఆగస్టు 19 నుండి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS ఢిల్లీ)లో చేరారు. చికిత్స పొందుతూ సెప్టెంబర్ 12 గురువారం అనారోగ్యంతో మరణించారు. ఏచూరి మరణానంతరం ఆయన కుటుంబ సభ్యులు భౌతికకాయాన్ని ఎయిమ్స్‌కు ఇవ్వాల‌ని నిర్ణయించారు. దీంతో ఆయ‌న‌ మృతదేహం విద్యార్థుల చదువు, పరిశోధన కోసం ఉపయోగించనున్నారు.

మన దేశంలో శరీర దానానికి ప్రధానంగా రెండు నియమాలున్నాయి. మొదటిదానిలో వ్యక్తి జీవించి ఉన్నప్పుడు తన శరీర భాగాలను దానం చేయాలని నిర్ణయించుకుంటాడు. రెండవ నియమంలో వ్యక్తి మరణించిన తరువాత కుటుంబ సభ్యులు వారి సమ్మతితో మృత దేహాన్ని దానం చేయాలని నిర్ణయించుకుంటారు. దేహ దానం తరువాత మృతదేహాన్ని విద్యా ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇది మొదటి సంవత్సరం విద్యార్థులకు అవయవాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. కొంత సమయం తర్వాత శరీరం క్షీణించడం ప్రారంభమ‌య్యాక‌.. అది కుటుంబ సభ్యుల సమ్మతి మేర‌కు తిరిగి ఇచ్చేస్తారు. లేదంటే.. శరీరాన్ని వాడిన‌ సంస్థలే మృతదేహాన్ని దహనం చేస్తాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యులు కోరుకుంటే.. అస్తికలను వారికి అందుబాటులో ఉంచుతారు.

Tags:    

Similar News