Putin Arrest Demand : ఆ దేశ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన పుతిన్‌ను అరెస్టు చేస్తారా.?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు మంగోలియా చేరుకున్నారు.

Update: 2024-09-03 03:13 GMT

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారిక పర్యటన నిమిత్తం ఈరోజు మంగోలియా చేరుకున్నారు. జపాన్‌పై సోవియట్-మంగోలియన్ దళాల ఉమ్మడి విజయానికి సంబంధించి 85వ వార్షికోత్సవం సందర్భంగా పుతిన్ పర్యటన జరుగుతోంది. అయితే.. మంగోలియా చేరుకున్న వెంటనే పుతిన్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్ పెరిగింది. ఇదే విధ‌మైన డిమాండ్ ప్ర‌పంచంలోని ప‌లు దేశాల‌లో కూడా ఉంది.

పుతిన్ అరెస్టుపై ఉక్రెయిన్ కూడా స్పందించింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ పుతిన్ అరెస్టుకు వారెంట్ జారీ చేసిన నేప‌థ్యంలో.. మంగోలియా ఈ కోర్టులో సభ్య దేశం కాబట్టి ఈ డిమాండ్ చేస్తుంది. గతేడాది పుతిన్‌ అరెస్ట్‌కు వారెంట్‌ జారీ అయింది. ఆ తర్వాత అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు (ఐసీసీ) సభ్య దేశం అయిన‌ మంగోలియాలో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి.

ఇదిలావుంటే.. మంగోలియా చేరుకున్న పుతిన్‌కు ఉలాన్‌బాతర్‌లో గార్డ్ ఆఫ్ హానర్ ల‌భించింది. అయితే.. ఈ చ‌ర్య‌ను పాశ్చాత్య దేశాలతో పాటు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని, హక్కుల సంఘాలను నిర్లక్ష్యం చేయడంగా పరిగణిస్తున్నారు.  

Tags:    

Similar News