ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజా ఆందోళన...రైళ్ల దిగ్బంధం!
ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజా ఆందోళన...రైళ్ల దిగ్బంధం!
ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం రైళ్ల దిగ్బంధం చేపట్టారు. (Rail Blockade) రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాలపై నిరసన తెలిపారు. దీంతో పలు రైళ్లు రద్దు అయ్యాయి. మరికొన్ని దారి మళ్లాయి. ఈ ఘటనలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బస్సులు, పలు వాహనాల్లో వారిని గమ్యస్థానాలకు చేర్చారు. అస్సాంలోని (Assom) కూచ్ బెహార్ (Cooch Behar)జిల్లాలో బుధవారం ఈ సంఘటన జరిగింది. కూచ్ బెహార్ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ కోసం గ్రేటర్ కూచ్ బెహార్ పీపుల్స్ అసోసియేషన్ (జీసీపీఏ) రైళ్ల దిగ్బంధానికి పిలుపునిచ్చింది. పిలుపుకు స్పందించిన అయిదు వేల మందికి పైగా అలీపుర్‌దూర్ డివిజన్‌లోని జోరాయ్ రైల్వే స్టేషన్ దగ్గరకు చేరుకున్నారు. పట్టాలపై నిరసన తెలిపారు. రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. ఫలితంగా న్యూ జల్‌పైగురి – గౌహతి, బొంగైగావ్-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లతో సహా పలు రైళ్ళు రద్దు అయ్యాయి. అలాగే బ్రహ్మపుత్ర మెయిల్, కామరూప్ ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లు, వివేక్ ఎక్స్‌ప్రెస్ వంటి పలు రైళ్లను దారి మళ్లించారు.