ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికకు నామినేషన్‌ దాఖలు చేశారు.

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వయనాడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికకు నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకు ముందు కల్పేట కొత్త బస్టాండ్ నుంచి రాహుల్ గాంధీ(Rahul Gandi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi)భారీ రోడ్‌షో నిర్వహించారు. ప్రియాంక ర్యాలీకి యూడీఎఫ్‌(UDF) నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టిన ప్రియాంకా గాంధీ వయనాడ్‌(Wayanad )లో ముక్కోణపు పోటీ ఎదుర్కొంటున్నారు. దశాబ్దకాలంగా ప్రజాప్రతినిధిగా ఉన్న బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్‌(Navya Haridas) ప్రియాంకకు గట్టి పోటీని ఇస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎల్‌డీఎఫ్‌(LDF) తరఫున సీపీఐ(CPI) నేత, మాజీ ఎమ్మెల్యే సత్యన్‌ మొకెరీ (Sathyan Mokeri)పోటీ చేస్తున్నారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాహుల్‌ గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్‌ల నుంచి పోటీ చేసి గెలిచారు. రాయ్‌బరేలీని ఉంచేసుకుని, వయనాడ్‌ స్థానాన్ని వదులుకున్నారు రాహుల్‌. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది. నవంబర్‌ 13న ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది.

ehatv

ehatv

Next Story