Kolkata Doctor Murder Case : కొనసాగుతోన్న‌ సంజయ్ రాయ్ 'లై' డిటెక్టర్ పరీక్ష

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ అబద్ధాలు ఈరోజు బట్టబయలు కానున్నాయి

Update: 2024-08-25 11:40 GMT

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ అబద్ధాలు ఈరోజు బట్టబయలు కానున్నాయి. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైలులో సంజయ్ రాయ్.. లై డిటెక్టర్ పరీక్ష జరుగుతోంది. ఈ నేప‌థ్యంలో అత‌డు ఎలాంటి రహస్యాలను వెల్లడిస్తాడోన‌ని ఉత్కంఠ నెల‌కొంది. కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయంలో పగటిపూట మరో ఇద్దరికి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సహా నలుగురికి పాలిగ్రాఫ్ పరీక్ష శనివారం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. రాయ్, మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సహా ఏడుగురికి లై డిటెక్టర్ పరీక్ష కోసం సీబీఐ అనుమతి కోరింది.

కేసు ట్రయల్ సమయంలో ఈ పరీక్ష సాక్ష్యంగా ప‌రిగ‌ణించ‌బడదు. అయితే బ‌ట్ట‌బ‌య‌లైన‌ విషయాలు మాత్రం తదుపరి దర్యాప్తు కోసం సీబీఐకి దిశానిర్దేశం చేస్తాయి. ఢిల్లీకి చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) నుంచి కోల్‌కతాకు వచ్చిన పాలిగ్రాఫ్ నిపుణుల బృందం.. ఈ పరీక్షలను నిర్వహిస్తోందని సీబీఐ అధికారి తెలిపారు.

కోల్‌కతా పోలీసులు ఆగస్టు 10న సంజయ్ రాయ్‌ని అరెస్టు చేశారు. ఒక రోజు ముందు వైద్య కళాశాల సెమినార్ హాల్‌లో 31 ఏళ్ల వైద్యురాలి మృతదేహం లభ్యమైంది. డాక్టర్ మృతదేహానికి సమీపంలో ఉన్న CCTV ఫుటేజ్, బ్లూటూత్ పరికరం ఆధారంగా రాయ్‌ను అరెస్టు చేశారు, అతడు కళాశాల సెమినార్ హాల్‌లోకి ప్రవేశించినట్లు అనుమానిస్తున్నారు. అక్కడ ఉదయం 4 గంటలకు మృతదేహం కనుగొన్నారు.

Tags:    

Similar News