Terrorists : సీఎం ఎదుట లొంగిపోనున్న 400 మంది ఉగ్రవాదులు.. పునరావాసానికి రూ.250 కోట్ల ప్యాకేజీ

మంగళవారం త్రిపురలోని సిపాహిజాలా జిల్లాలో 400 మంది ఉగ్రవాదులు తమ ఆయుధాలను ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఎదుట అప్పగించనున్నారు.

Update: 2024-09-24 00:56 GMT

మంగళవారం త్రిపురలోని సిపాహిజాలా జిల్లాలో 400 మంది ఉగ్రవాదులు తమ ఆయుధాలను ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఎదుట అప్పగించనున్నారు. ఈ ఉగ్రవాదులు నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (NLFT) మరియు ఆల్ త్రిపుర టైగర్ ఫోర్స్ (ATTF) సభ్యులుగా నివేదిక‌లు వెల్ల‌డించాయి. సెప్టెంబర్ 4న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసిన నేప‌ధ్యంలో ఉగ్రవాదులంతా లొంగిపోనున్నారు.

జంపుయిజాలాలోని త్రిపుర స్టేట్ రైఫిల్స్ (టిఎస్‌ఆర్) 7వ బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో ఎన్‌ఎల్‌ఎఫ్‌టి, ఎటిటిఎఫ్‌కు చెందిన 400 మంది ఉగ్రవాదులు సీఎం ముందు తమ ఆయుధాలు అప్ప‌గించ‌నున్న‌ట్లు హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు.

శాశ్వత శాంతికి మార్గం సుగమం చేసేందుకు రెండు చట్టవిరుద్ధమైన గ్రూపులకు చెందిన నాయకులందరూ తమ ఆయుధాలను అప్పగిస్తారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. రెండు గ్రూపులకు చెందిన తీవ్రవాదులకు పునరావాసం కల్పించేందుకు కేంద్రం రూ.250 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.

Tags:    

Similar News