Speaker Election : ఇండియా కూట‌మి అభ్య‌ర్ధిపై ఓం బిర్లా విజ‌యం

ఓం బిర్లా మళ్లీ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నిక‌య్యారు. ఓం బిర్లా లోక్‌సభ స్పీకర్‌ అయ్యారు. విపక్షాలతో ఏకాభిప్రాయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

By :  Eha Tv
Update: 2024-06-26 06:10 GMT

ఓం బిర్లా మళ్లీ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నిక‌య్యారు. ఓం బిర్లా లోక్‌సభ స్పీకర్‌ అయ్యారు. విపక్షాలతో ఏకాభిప్రాయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో NDA నుండి ఓం బిర్లా, ఇండియా కూట‌మి నుంచి K. సురేష్ అభ్యర్ధులుగా బ‌రిలో నిలిచారు. ఈ పోరులో కె.సురేష్‌పై ఓం బిర్లా మూజువాణి ఓటింగ్‌ ద్వారా గెలుపొందినట్టు ప్రొటెం స్పీకర్‌ మహతాబ్‌ భర్తృహరి ప్రకటించారు. ఓటింగ్ అనంత‌రం ప్రధాని మోదీ, విపక్ష నేత రాహుల్‌ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు కలిసి ఓంబిర్లాను స్పీకర్‌ కుర్చీ వద్దకు తీసుకెళ్లారు. అంత‌కుముందు 2019 - 2024 లోనూ ఓం బిర్లా స్పీకర్‌గా వ్యవహరించారు. ఇదిలావుంటే.. గతంలో 1952, 1976ల‌లో మాత్ర‌మే లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఎన్నికలు జరగ‌డం విశేషం. 

Tags:    

Similar News