Anvi Kamdar : లోయలో పడి ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ మృతి

రాయ్‌గఢ్‌లోని మంగావ్ జిల్లాలోని కుంభే జలపాతాల సమీపంలో బుధవారం వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ లోయలో పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు.

By :  Eha Tv
Update: 2024-07-18 05:12 GMT

రాయ్‌గఢ్‌లోని మంగావ్ జిల్లాలోని కుంభే జలపాతాల సమీపంలో బుధవారం వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ లోయలో పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిని ముంబైకి చెందిన అన్వీ కామ్దార్ (26)గా గుర్తించారు. ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ కామ్‌దార్‌కి రీల్స్ చేయ‌డం అంటే ఇష్టం. ఆమె తన స్నేహితులతో కలిసి వాటర్ ఫాల్స్ కు వెళ్ళింది. జలపాతం వ‌ద్ద‌ ఫోటోలు, వీడియోలు తీస్తుండ‌గా.. కాలు జారి ఆమె నేరుగా 350 అడుగుల లోతైన లోయలో పడిపోయింది.

ఘటనపై సమాచారం అందిన వెంటనే సహ్యాద్రి వన్యప్రాణి సంరక్షణ సంఘం, మంగావ్ పోలీసు అధికారులు రెస్క్యూ బలగాలతో ఘటనాస్థలికి చేరుకున్నారు. కొండగట్టుపై పడిన మహిళ సజీవంగా ఉందని రాయగడ పోలీసు సూపరింటెండెంట్ సోమనాథ్ ఘర్గే తెలిపారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

“లోయ నుండి స్త్రీని రక్షించడానికి దిగుతుండగా.. అక్కడ ఉన్న‌ పెద్ద రాళ్ళు మాపై పడ్డాయి. మొదట్లో ఆ మహిళ బతికే లేదనిపించింది. అయితే దగ్గరికి వెళ్లిన తర్వాత ఊపిరి పీల్చుకోవడంతో ఆమె బతికే ఉన్నట్లు నిర్ధారించాం. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించాం. అయితే, చికిత్స పొందుతూ ఆమె మరణించింది' అని సోమనాథ్ ఘర్గే తెలిపారు.

Tags:    

Similar News