Gujarat : ఆమె ముస్లిం కాబట్టి ఇక్కడ ఉండనిచ్చే ప్రసక్తేలేదు..!

సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన ఇది! మన తెలంగాణలో ఇలాంటి మతమౌఢ్యులు లేకపోవడం మన అదృష్టమనే చెప్పుకోవాలి.

By :  Eha Tv
Update: 2024-06-15 06:12 GMT

మనమందరం సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటన ఇది! మన తెలంగాణలో ఇలాంటి మతమౌఢ్యులు లేకపోవడం మన అదృష్టమనే చెప్పుకోవాలి. మనుషులుగా మనమందరం సిగ్గుపడే ఆ ఘటన గుజరాత్‌లో(Gujarat) జరిగింది. విషయానికి వస్తే గుజరాత్‌లోని ఓ మంత్రిత్వ శాఖకు చెందిన ఓ విభాగంలో ఓ ముస్లిం మహిళ(Muslim woman) పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆవాస్‌ యోజన పథకం(Awas Yojana Scheme) కింద వడోదర హార్నీ ప్రాంతలో నిర్మించిన మోట్‌నాథ్‌ హౌజింగ్‌ క్లాంపెక్స్‌లో(Motnath Housing Clampex) ఏడేళ్ల కింట ఆమెకు ఫ్లాట్‌ కేటాయించారు. ఇదేదో దయతలచి ఇచ్చింది. ఆమెకు అర్హత ఉంది కాబట్టే ఫ్లాట్‌ అలాటయ్యింది. ఫ్లాట్ లభించి ఏడేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఆమె ఆ ఇంట్లో అడుగుపెట్టలేకపోయింది. అందుకు కారణం అధికారులు కాదు. మరి ఎవరు అంటే ఆమెతో పాటుగా ఫ్లాట్లు పొంది అక్కడ హాయిగా నివసిస్తున్న కొందరు మత పిచ్చిగాళ్లు. వడోదర మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని కాంప్లెక్స్‌లో 462 ఫ్లాట్లు ఉన్నాయి. అర్హత జాబితా ప్రకారం.. 2017లో ఫాతిమాకు అందులో ఓ ఫ్లాట్‌ను కేటాయించారు. అయితే ఆ హౌజింగ్‌ కాంప్లెక్స్‌లో ఉండే 33 మంది ఓనర్లు ఆమెకు ఇంటికి కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ఆమె ముస్లిం కావడమే. అమె అక్కడ ఉంటే గొడవలు జరిగే అవకాశం ఉందట! ఇలాగని 2020లో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటుగా కలెక్టర్‌కు, స్థానిక అధికారులకు లేఖలు రాసి తమ కురచ బుద్ధిని చాటుకున్నారు. అంతటితో ఆగకుండా ధర్నాకు సైతం దిగారు. జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు ఇచ్చారు. ఇవన్నీ చూసిన తర్ఆత ఆమె అక్కడికి వెళ్లకుండా ఆగిపోయారు. భర్తను కోల్పోయిన ఆ మహిళ ఇంతకాలం పుట్టింట్లోనే ఉండిపోయారు. కొడుకు అదే ఏరియాలో మరో ఇంట్లో ఉంటున్నాడు. ఏళ్లు గడిచిపోయాయి కదా ! పరిస్థితులు సద్దుమణిగి ఉంటాయని అనుకున్నారు. కొడుకుతో పాటు తాను అక్కడికి షిఫ్ట్‌ అవుదామనుకున్నారు. ఇన్నేళ్ల కాలంలో వారి బుద్ధి ఏ మాత్రం మారలేదు సరికదా! ఇంకాస్త మెదడు చెడిపోయింది. ఆమె వస్తున్నదన్న విషయం తెలుసుకుని ఆ 32 మంది ధర్నాకు దిగారు. ప్రశాంతంగా ఉంటున్న తమ సమూహంలోకి ఆమె వస్తే అలజడి చెలరేగుతుందని అంటున్నారు. ఆమెను ఇక్కడ ఉండనిచ్చే ప్రసక్తే లేదంటూ నిరసన చేపట్టారు. హిందు ధర్మం ప్రమాదంలో ఉందని వాదిస్తున్నారు. 462 ఫ్లాట్లలో ఒక్క ముస్లిం కుటుంబం ఉంటే హిందూ ధర్మం ప్రమాదంలో పడినట్టు అవుతుందా? వారికి మెదడుతో పాటు జ్ఞానం కూడా శూన్యమేని ఈ మాటలతో అర్థమవుతుంది. ఇంత అన్యాయం జరుగుతున్నా ఆ కాంప్లెక్స్‌లోని మిగతా 400 మంది ఓనర్లు చోద్యం చూస్తున్నారు. అధికారులు కూడా అంతే! ఇది ఆ కాంప్లెక్స్‌లో ఉంటున్న వారి సమస్య కాబట్టి వారే తేల్చుకోవాలని జవాబిస్తున్నారు.

Tags:    

Similar News