వైద్యపరీక్షల కోసం వచ్చి రెండు రోజులు లిఫ్ట్‌లోనే!

లిఫ్ట్‌లో చిక్కుకుపోతే అరగంట కూడా అందులో ఉండలేం! అలాంటిది రెండు రోజుల పాటు లిఫ్ట్‌లో ఉండటమంటే మాటలు కాదుగా! అది కూడా వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన పేషంట్‌కు ఆ పరిస్థితి వస్తే! ఊహించడానికే భయంగా ఉంది కదూ!

By :  Eha Tv
Update: 2024-07-15 11:20 GMT

లిఫ్ట్‌లో చిక్కుకుపోతే అరగంట కూడా అందులో ఉండలేం! అలాంటిది రెండు రోజుల పాటు లిఫ్ట్‌లో ఉండటమంటే మాటలు కాదుగా! అది కూడా వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన పేషంట్‌కు ఆ పరిస్థితి వస్తే! ఊహించడానికే భయంగా ఉంది కదూ! man 'missing' for 2 days found stuck in hospital lift in keralaకు వచ్చిన ఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. ఉళ్లూరు ప్రాంతానికి చెందిన రవీంద్రన్‌ నాయర్‌ (59) తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. మొన్న శనివారం ఉదయం వైద్య పరీక్షల కోసం తిరువనంతపురం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌కు వెళ్లాడు. ఓపీ బ్లాక్‌లోని ఫస్ట్‌ ఫ్లోర్‌కు వెళ్లడానికి లిఫ్ట్‌ ఎక్కాడు. అదే సమయంలో లిఫ్ట్‌లో సమస్య వచ్చి ఆగిపోయింది. పాపం రవీంద్రన్‌ అందులోనే చిక్కుకుపోయాడు. ఎన్నిసార్లు అలారం బటన్‌ నొక్కినా ప్రయోజనం లేకుండా పోయింది. లిఫ్ట్‌ బలంగా ఊగడం వల్ల రవీంద్రన్‌ ఫోన్‌ కూడా కిందపడి పగిలింది. ఫలితంగా తాను లిఫ్ట్‌లో ఉన్న విషయాన్ని ఇతరులకు చెప్పే ఛాన్స్‌ లేకుండా పోయింది. దాంతో అప్పటి నుంచి రవీంద్రన్‌ నాయర్‌ లిఫ్ట్‌లోనే ఉండిపోయాడు. రవీంద్రన్‌ ఎంతకీ ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్నారు. సోమవారం ఉదయం లిఫ్ట్ ఆపరేటర్‌ వచ్చి చూస్తే లిఫ్ట్‌ పని చేయడం లేదని తెలిసింది. వెంటనే రిపేర్‌ చేసి లిఫ్ట్‌ డోర్‌ తెరిచి చూస్తే రవీంద్రన్‌ స్ప్రహ తప్పి కనిపించాడు. వెంటనే వైద్యులు అతడికి ప్రాథమిక చికిత్స అందించారు. ప్రస్తుతం రవీంద్రనాయర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య చికిత్స కోసం ప్రజలు ఆసుపత్రికి వస్తుంటారని, లిఫ్ట్‌ పనిచేయని విషయాన్ని కూడా సిబ్బంది గుర్తించకపోవడం ఏమిటని తిట్టిపోస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్‌ రియాక్టయ్యారు. దర్యాప్తుకు ఆదేశించారు.

Tags:    

Similar News