Doctor Murder Case : సీఎం రాజీనామా చేయాల‌ని బీజేపీ.. నిందితుడిని ఉరి తీయాలని ముఖ్య‌మంత్రి.. ర్యాలీలు

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఈ సాయంత్రం కోల్‌కతాలో ర్యాలీ జరగనుంది.

Update: 2024-08-16 06:40 GMT

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో ఈ సాయంత్రం కోల్‌కతాలో ర్యాలీ జరగనుంది. RG KAR మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అకృత్యాలకు వ్యతిరేకంగా TMC ఈ ర్యాలీని చేపట్టనుంది.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. కోల్‌కతాతో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శుక్రవారం ప్రతిపక్ష బీజేపీ నిరసనలు చేపట్టనుంది. ముఖ్యమంత్రి కాళీఘాట్ నివాసం వరకు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాండిల్ మార్చ్ కూడా నిర్వహించనున్నారు.

మరోవైపు.. దోషులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ ద్వారా మమత ప్రభుత్వం దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయ‌నుంది. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. వచ్చే ఆదివారం నాటికి దోషులను ఉరి తీయాలని మమతా బెనర్జీ డిమాండ్ చేస్తూ.. సీబీఐకి ఓ ర‌కంగా అల్టిమేటం జారీ చేశారు.

RG KAR మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌లో వైద్యుల నిరసన కొనసాగుతోంది. బెంగాల్ పోలీసులు కేసును సరిగ్గా విచారించ‌లేద‌ని వైద్యులు ఆరోపిస్తున్నారు. ఘటనలో ఆధారాలు ధ్వంసం చేశార‌ని అంటున్నారు.

ర్యాలీ గురించి సమాచారం ఇస్తూ తృణమూల్ ఎంపీ, అధికార ప్రతినిధి డెరెక్ ఓబ్రెయిన్ మాట్లాడుతూ.. కోల్‌కతాలో యువతిపై జరిగిన హత్య, అత్యాచారం దారుణం అన్నారు. ప్రజల ఆగ్రహం పూర్తిగా అర్థమవుతుందన్నారు. ఈ ఘటనపై సీబీఐ ప్రతిరోజూ అప్‌డేట్‌ ఇవ్వాలని ఆయన అన్నారు. 

Tags:    

Similar News