మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు(Maharashtra election results) వెలువడుతుండడంతో ఇప్పుడు దృష్టి అంతా కేకే సర్వేపై(KK Survey) పడింది
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు(Maharashtra election results) వెలువడుతుండడంతో ఇప్పుడు దృష్టి అంతా కేకే సర్వేపై(KK Survey) పడింది. ఆంధప్రదేశ్‌లో(AP) కేకే సర్వే ఫలితాలను కచ్చితంగా అంచనా వేసింది. మహాయుతి కూటమి 219 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్(Congress) కూటమి 55 చోట్ల ముందంజలో ఉండగా.. ఇతరులు 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు అనుగుణంగానే వస్తున్నాయి. మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్‌లో(Exist Polls) మ్యాట్రిజ్ సర్వే బీజేపీ కూటమికి 150-170 వరకు వస్తాయని.. కాంగ్రెస్ కూటమికి 110-130 వస్తాయని చెకప్పగా.. పీ మార్క్ సర్వేలో మహాయుతి కూటమికి 137-157 సీట్లు వస్తాయని తెలపగా కాంగ్రెస్ కూటమికి 126-146 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అయితే కేకే మాత్రం బీజేపీ కూటమికి 225 సీట్లు వస్తాయని.. కాంగ్రెస్ కూటమి 56 సీట్లు, ఇతరులు 7 స్థానాల్లో గెలుస్తారని అంచనా వేసింది. ఫలితాలు మాత్రం పలు సర్వేలకు భిన్నంగా కేకే చెప్పినట్లే ఫలితాలు వస్తున్నాయి. ఏపీలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సునామీ తరహాలో విజయం సాధిస్తుందని కేకే సర్వే పేర్కొంది. 175 నియోజకవర్గాలకు గాను టీడీపీ కూటమి 161 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. వైసీపీ 14 సీట్లల్లో మాత్రమే గెలుస్తుందని కేకే సర్వే తెలపింది. కేకే చెప్పినట్లు ఒకటి, రెండు సీట్లు అటుఇటుగా ఏపీలో ఫలితాలు వచ్చాయి. అప్పటి నుంచి కేకే సర్వేపై ప్రజలకు ఒక అంచనా ఏర్పడింది. తాజాగా మహారాష్ట్రలో కూడా కేకే సర్వే ఆల్మోస్ట్ నిజం కావడంతో ఈ సంస్థపై మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉంది.