Delhi New CM : ముగిసిన ఆప్ పీఏసీ సమావేశం.. రేపు కొత్త సీఎం ఫైన‌ల్‌

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ముగిసింది. ఢిల్లీ సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది.

Update: 2024-09-16 14:15 GMT

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ముగిసింది. ఢిల్లీ సీఎం నివాసంలో ఈ భేటీ జరిగింది. ఇందులో ఆప్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. కొత్త సీఎం పేరుపై సమావేశంలో చర్చ జరిగింది. మంగళవారం ఉదయం ఆప్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరగనుంది. అందులో సీఎం అభ్యర్థి పేరును ఆమోదించనున్నారు. ఢిల్లీ మంత్రి, ఆప్‌ నేత సౌరభ్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ.. 'నిన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మంగళవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

దీనికి సంబంధించి ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పీఏసీ (రాజకీయ వ్యవహారాల కమిటీ) సమావేశం నిమిత్తం పిలిచారు. ఇందుకు ఢిల్లీలోని సీనియర్ నాయకులు, క్యాబినెట్ మంత్రులందరినీ పిలిచారు. కొత్త సీఎం విషయంలో నేతలు, మంత్రులందరితో వన్ టు వన్ చర్చలు జరిపారు. రేపు ఎమ్మెల్యేలతో రెండో సెషన్‌ను నిర్వహించనున్నారు. PACలో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ ససోడియా, సంజయ్ సింగ్, దుర్గేష్ పాఠక్, అతిషి మర్లెనా, గోపాల్ రాయ్, ఇమ్రాన్ హుస్సేన్, రాఘవ్ చద్దా, రాఖీ బిర్లాన్, పంకజ్ గుప్తా, ND గుప్తా సభ్యులుగా ఉన్నారని తెలిపారు.

రాబోయే 48 గంటల్లో తన పదవికి రాజీనామా చేస్తానని, ప్రజలు అనుమతించే వరకు సీఎం పదవిలో కూర్చోబోనని సీఎం కేజ్రీవాల్ ఆదివారం స్వయంగా ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత.. కొత్త సీఎం పదవికి పలువురు ఆప్ నేతల పేర్లు రేసులో ఉన్నాయి. అయితే అతిషి పేరు మాత్రం ముందు వరుసలో వినిపిస్తోంది. ఆమెతో పాటు కైలాష్ గెహ్లాట్, సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్, రాఘవ్ చద్దా పేర్లు కూడా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. అయితే రేపటి సమావేశం తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

Tags:    

Similar News