ప్రియుడు(Lover) దూరం పెట్టాడని హైదరాబాద్‌లో(Hyderabad) కాశ్మీరీ యువతి(Kashmir woman) ఆత్మహత్య
ప్రియుడు(Lover) దూరం పెట్టాడని హైదరాబాద్‌లో(Hyderabad) కాశ్మీరీ యువతి(Kashmir woman) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లో బంజారాహిల్స్(Banjara hills), ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రియుడు సరిగా మాట్లాడటం లేదని మనస్తాపానికి గురైన కశ్మీరి యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు జమ్ము- కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా మాలపొర గ్రామానికి చెందిన ఇరామ్ నబీ దార్ (23) బ్యాంక్ ఆఫ్ అమెరికాలో శ్యాంపిల్ ఎగ్జిక్యూషన్ అనలిస్ట్‌గా పనిచేస్తుంది. బారాముల్లా మాలాపొరా ప్రాంతానికి చెందిన ఇరం నబీడార్ (23) షేక్‌పేట గుల్షన్‌కాలనీలో ఓ పెంట్‌హౌస్‌లో అద్దెకు ఉంటూ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా గత జనవరి నుంచి పనిచేస్తోంది. ఆత్మహత్యకు ముందు బారాముల్లాలో ఉండే తన ప్రియుడితో మాట్లాడినట్లు నిర్ధారించారు. ఈనెల 8న ఉదయం ఆమె స్నేహితుడు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత అబ్దుల్‌కు తల్లి కూడా ఫోన్ చేసి తన కూతురు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఇంటికి వెళ్లి చూసి రావాలని తెలిపింది. దీంతో అబ్దుల్ సా.5:30కి వెళ్లి తలుపుతట్టగా ఎంతకూ తీయలేదు. దీంతో పక్కనే ఉన్న వాచ్‌మన్‌ను పిలిచి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కన్పించింది. ఇరంను కిందకు తీసి అంబులెన్స్ సహాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అబ్దుల్ ఇచ్చిన ఫిర్యాదు ఫిలింనగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు తీసుకున్నారు. ఆత్మహత్యకు ముందు రోజు తన ప్రియుడితో మాట్లాడినట్లు గుర్తించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని విమానంలో కశ్మీర్‌కు తరలించారు.