Kangana Ranaut : ముస్లీం దేశాలపై కంగనా రనౌత్ ఆగ్రహం

బంగ్లాదేశ్(Bangladesh) అధినేత్రి షేక్ హసీనా(Sheikh Hasina) భారత్‌(India)లో సురక్షితంగా ఉండడం గర్వకారణమని బీజేపీ(BJP) ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) సోమవారం అన్నారు

Update: 2024-08-06 02:35 GMT

బంగ్లాదేశ్(Bangladesh) అధినేత్రి షేక్ హసీనా(Sheikh Hasina) భారత్‌(India)లో సురక్షితంగా ఉండడం గర్వకారణమని బీజేపీ(BJP) ఎంపీ కంగనా రనౌత్(Kangana Ranaut) సోమవారం అన్నారు. ముస్లిం దేశాలు(Muslim Countries) ముస్లింలకు కూడా సురక్షితం కాదని ఆమె అన్నారు. 'హిందూ దేశం' అంటూ ప్రశ్నించే వారిపై విమర్శలు గుప్పించారు.

హిందూ దేశం(Hindu Country) ఏంటి.. రామరాజ్యం(Ram Rajyam) ఏంటి అని అడుగుతూనే ఉంటారు. అది ఎందుకో ఇలాంటి స‌మ‌యాల్లో స్పష్టంగా తెలుస్తుంది. ముస్లిం దేశాల్లో ఎవరూ సురక్షితంగా లేరని.. ఆ దేశాల‌లో ముస్లింలు కూడా సురక్షితంగా లేరని కంగనా అన్నారు. ఆఫ్ఘనిస్తాన్(Afghanistan), పాకిస్తాన్(Pakistan), బంగ్లాదేశ్, బ్రిటన్‌(Britain)ల‌లో ఏమి జరిగినా దురదృష్టకరం. రామరాజ్యంలో మనం జీవించడం మన అదృష్టం అన్నారు. 

Tags:    

Similar News