జయాషెట్టి హత్య కేసులో గ్యాంగ్‌స్టర్‌ ఛోటా రాజన్‌కు బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

జయాషెట్టి హత్య కేసులో గ్యాంగ్‌స్టర్‌ ఛోటా రాజన్‌కు బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ ఏడాది మొదట్లో ఈ కేసులో ఛోటా రాజన్‌(Chhota Rajan)కు జీవిత ఖైదు శిక్ష పడింది. ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్‌ రేవతి మోహితే డేరే(Justice Revathi Mohite Dere), జస్టిస్‌ పృథ్వీరాజ్‌ చవాన్‌(Justice Prithviraj Chavan)లతో కూడిన డివిజనల్‌ బెంచ్‌ జీవిత ఖైదును రద్దు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్‌ మంజూరు చేసింది. సెంట్రల్‌ ముంబాయి(Mumbai)లోని గామాదేవి(GamaDevi) ప్రాంతంలో గోల్డెన్‌ క్రౌన్‌ హోటల్‌(Golden Crown Hotel)ను జయాషెట్టి నిర్వహించేవారు. 2001, మే 4వ తేదీన హోటల్‌లో ఉన్న ఆమెను దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్యను ఛోటా రాజన్‌ చేయించినట్టు తేలింది. అంతకు ముందు ఛోటా రాజన్‌ పలు మార్లు ఆమెకు ఫోన్‌ చేసి బెదిరించాడట! ఛోటా రాజన్‌ నుంచి తనకు ప్రాణహాని ఉందని జయా షెట్టి( Jaya Shetty)పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె కంప్లయింట్‌ మేరకు ఆమెకు సెక్యూరిటీ కల్పించారు. కొన్ని రోజులకే ఎలాంటి హాని లేదని సెక్యూరిటీని తీసేశారు. ఇది జరిగిన రెండు నెలలకే జయా షెట్టి హత్యకు గురయ్యారు.

ehatv

ehatv

Next Story