☰
✕
మనం తెలియని చోటుకు వెళ్లడానికి గూగుల్ మ్యాప్‌పై(Google maps) ఆధారపడుతున్నాం.
x
మనం తెలియని చోటుకు వెళ్లడానికి గూగుల్ మ్యాప్‌పై(Google maps) ఆధారపడుతున్నాం. అదైతే గమ్యానికి సరిగ్గా చేరుస్తుందన్న నమ్మకం. ఆ నమ్మకంతోనే ఓ ముగ్గరు గూగుల్ మ్యాప్ పెట్టుకుని ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బరేలీలో(Bareli) ఓ కుటుంబం గూగుల్ మ్యాప్స్ ఆధారంగా కారులో(Car) ప్రయాణిస్తున్నారు. పొగ మంచు కమ్మేయడంతో జీపీఎస్‌ను నమ్ముకుని ప్రయాణం కొనసాగించారు. జీపిఎస్ నిర్మాణంలో ఉన్న వంతెనను(Bridge) చూపించింది. దాన్ని ఫాలో అవుతూ కారు వెళ్లింది. ఆ బ్రిడ్జ్ ఇంకా నిర్మాణంలోనే(Under construction) ఉండటంతో కారు నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారించారు. గూగుల్ మ్యాప్ కారణం గానే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు.
Eha Tv
Next Story