Air India : ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ప్ర‌క‌ట‌న‌

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఈరోజు ముంబై నుంచి తిరువనంతపురం వెళ్తున్న విమానానికి బెదిరింపు రావడంతో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు

Update: 2024-08-22 03:58 GMT

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఈరోజు ముంబై నుంచి తిరువనంతపురం వెళ్తున్న విమానానికి బెదిరింపు రావడంతో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఉదయం 8 గంటలకు విమానాన్ని విమానాశ్రయంలో ల్యాండ్ చేసి.. ఐసోలేషన్ బేకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులను విమానం నుంచి బయటకు తరలించినట్లు తెలిపారు.

విమానం తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకోగానే పైలట్ బాంబు బెదిరింపు గురించి తెలియజేసినట్లు వార్తా సంస్థ పీటీఐ వర్గాలు తెలిపాయి. విమానంలో 135 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బెదిరింపుల‌కు సంబంధించి మ‌రింత‌ సమాచారం కోసం వేచి ఉన్నామని అధికారులు వెల్ల‌డించారు.

ఇటీవల గుజరాత్, పంజాబ్, అస్సాంలోని మూడు మాల్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. బెదిరింపు అనంతరం మాల్స్‌ను ఖాళీ చేయించి విచారణ చేపట్టారు. పంజాబ్‌లోని మాల్‌లో అనుమానాస్పదంగా ఏమీ దొర‌క‌లేదు. అదే రోజు సూరత్‌లోని మాల్‌ను పేల్చివేస్తామని బెదిరింపు వచ్చింది. పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆ తర్వాత మాల్‌ను పరిశీలించారు. అక్క‌డ ఏమీ అనుమాన‌స్ప‌దంగా క‌నిపించ‌లేదు. 

Tags:    

Similar News