Bribe Case: 34 ఏళ్లు వెంటాడిన 20 రూపాయల లంచం

34 ఏళ్లు వెంటాడిన

Update: 2024-09-06 02:38 GMT

34 ఏళ్ల నాటి లంచం కేసు ఓ పోలీసు కానిస్టేబుల్ ను కటకటాల పాలు చేసింది. 1990లో బీహార్‌లోని సహర్సా రైల్వే స్టేషన్‌లో కూరగాయలు తీసుకెళ్తున్న మహిళ నుంచి రూ. 20 లంచం తీసుకున్నాడు మాజీ కానిస్టేబుల్‌. అతడిని అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించడంతో షాక్ అయ్యాడు.

ఈ సంఘటన మే 6, 1990 నాటిది, బరాహియాకు చెందిన సురేష్ ప్రసాద్ సింగ్ అనే కానిస్టేబుల్ సహర్సా రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై కూరగాయల మూటను తీసుకువెళుతుండగా మహేశ్‌ఖుంట్‌లో నివాసం ఉంటున్న సీతాదేవిని సురేష్ ప్రసాద్ ఆపాడు. సీతాదేవి కొద్దిసేపు గుసగుసలాడాడు, ఆ తర్వాత ఆమె చీరలో ఉన్న ముడి నుండి డబ్బు ఇవ్వమని అడిగాడు. 20 రూపాయల లంచాన్ని సురేష్ ప్రసాద్ సింగ్ తన జేబులో వేసుకున్నాడు. అతడిని నిశితంగా గమనించిన అప్పటి రైల్వేస్టేషన్‌ ఇన్‌చార్జి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో వెంటనే లంచం స్వాధీనం చేసుకున్నారు.

ముప్పై నాలుగు సంవత్సరాల తరువాత, స్పెషల్ విజిలెన్స్ జడ్జి సుదేష్ శ్రీవాస్తవ గురువారం నాడు సురేష్ ప్రసాద్ సింగ్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరచాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి)ని ఆదేశించారు. లంచం తక్కువ మొత్తం అయినప్పటికీ.. ఈ కేసు మూడు దశాబ్దాలుగా సాగింది. బెయిల్ పొందిన సురేష్ ప్రసాద్ సింగ్ కోర్టుకు హాజరు కావడంలో విఫలమయ్యాడు. 1999 నుండి అతని బెయిల్ బాండ్ రద్దు చేశారు. అరెస్ట్ వారెంట్ జారీ చేసినప్పటి నుండి పరారీలో ఉన్నాడు. ఆస్తి అటాచ్‌మెంట్ ఆర్డర్ జారీ చేసిన తర్వాత కూడా సింగ్‌ను గుర్తించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

సింగ్ సర్వీస్ రికార్డులపై దర్యాప్తులో అతను మహేష్‌ఖుంట్‌లో తప్పుడు చిరునామాను అందించాడని, అతని వాస్తవ నివాసం బరాహియా, లఖిసరాయ్ జిల్లాలోని బిజోయ్ గ్రామం అని ఇటీవల తెలుసుకున్నారు. దీంతో స్పెషల్ విజిలెన్స్ జడ్జి సుదేష్ శ్రీవాస్తవ కొత్త ఆదేశాలతో, సింగ్ అరెస్టును నిర్ధారించాలని బీహార్ పోలీసు డీజీపీకి ఆదేశాలు అందాయి. అలా 20 రూపాయలు లంచం 34 సంవత్సరాలు వెంటాడింది.


Tags:    

Similar News