RBI : 10, 20, 50 రూపాయల నోట్ల ముద్రణ ఆర్‌బీఐ నిలిపివేసిందా.? ఆర్థిక మంత్రికి కాంగ్రెస్ ఎంపీ లేఖ
10, 20, 50 నోట్ల కొరత కారణంగా పట్టణ ప్రజలే కాకుండా గ్రామీణ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
10, 20, 50 నోట్ల కొరత కారణంగా పట్టణ ప్రజలే కాకుండా గ్రామీణ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. పేదలు ఎక్కువగా నష్టపోతున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాసిన లేఖలో ఈ విషయాన్ని తెలిపారు.
సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చిన్న నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. దీని వెనుక యూపీఐ, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడమే కారణమని ఆ నివేదికలు చెబుతున్నాయి.
ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తోందంని అర్థమవుతోందని.. అయితే చిన్న నోట్లను నిషేధించడం ఏమాత్రం సరికాదని మాణికం అన్నారు. ఈ కారణంగా ప్రతిరోజూ నోట్ల ద్వారా చిన్నచిన్న చెల్లింపులు చేసేవారు ఇబ్బంది పడుతున్నారు. డిజిటల్ లావాదేవీలు నిర్వహించలేని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
చిన్న నోట్ల ముద్రణను పునఃప్రారంభించేలా ఆర్బీఐని ఆదేశించాలని కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ ఆర్థిక మంత్రిని డిమాండ్ చేశారు. అలాగే ప్రజల డిమాండ్‌కు సరిపడా నోట్ల సరఫరా ఉండేలా చూడాలని కోరారు. గ్రామాల్లో డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలని కూడా కోరారు. రోజువారీ కూలీలు, వీధి వ్యాపారులు ఖాళీ నగదుపైనే ఆధారపడుతున్నారని.. దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాణికం ఠాగూర్ అన్నారు.