పుణెలో(Pune) ఓ క్యాబ్ డ్రైవర్(Cab driver) ఉమేష్ తన భార్య తప్పిపోయిందని రెండు రెజులుగా వెతికాడు.
పుణెలో(Pune) ఓ క్యాబ్ డ్రైవర్(Cab driver) ఉమేష్ తన భార్య తప్పిపోయిందని రెండు రెజులుగా వెతికాడు. కానీ తన భార్య(Wife) శవం(Dead body) తాను రోజూ పడుకునే సోఫాలోనే(Sofa) ఉందని ఆలస్యంగా గుర్తించాడు. భార్యను ఎవరో హత్య(Murder) చేసి సోఫాలో కుక్కినట్లు తెలుసుకొని షాకయ్యాడు. ఫుర్సుంగి పోలీసులు హత్యపై దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలిని హడప్సర్ సమీపంలోని హుండేకర్ వస్తీ నివాసి స్వప్నాలి ఉమేష్ పవార్ (24)గా గుర్తించారు. నవంబర్ 7వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో భర్త ఉమేష్ ఆమెకు ఫోన్ చేసినట్లు తెలిసింది. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉమేష్ ఓ ప్రయాణికుడిని డ్రాప్ చేసేందుకు బీడ్‌లో ఉండగా.. ఆమెకు ఫోన్ చేశాడు. కానీ మరుసటి రోజు అతను పదేపదే ప్రయత్నించినప్పటి ఆమె ఫోన్ ఆఫ్ వచ్చింది. ఆందోళన చెందిన ఉమేష్ పూణేలోని స్నేహితుడిని తన ఇంటికి వెళ్లమని అడిగాడు, అతని ఇంట్లో అతని భార్య ఆచూకీ లేదని స్నేహితుడు చెప్పాడు. అదేరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు పూణెకు తిరిగి వచ్చి భార్య కోసం వెతకసాగాడు. స్నేహితులు, బంధువులను ఆరా తీశారు. శనివారం ఉదయం, 7 గంటలకు, తన భార్య విలువైన వస్తువులు కూడా కనిపించకుండా పోయాయని తెలుసుకున్న ఉమేష్, సోఫాలో ఉండె చిన్న స్టోరేజ్‌ను(Sofa storage space) తెరిచి చూశాడు. తన భార్య శవం అందులో ఉండడంతో స్టన్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్ట్‌మార్టంలో గొంతు నులిమి చంపారని నిర్ధారించారు. మెడపై గోరు గుర్తులను కూడా గుర్తించారు. ఎవరో తెలిసిన వ్యక్తే స్వప్నాలిని చంపారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ వ్యక్తి తరుచుగా క్యాబ్ డ్రైవర్ ఉమేష్ ఇంటికి వచ్చేవాడని.. అతని ఫోన్ స్విచాఫ్ వస్తోందని పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.