అక్రమార్జన ఆరోపణలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై(Nirmala sitaraman) ఎఫ్‌ఐఆర్(Fir) నమోదు చేయాలని బెంగళూరు కోర్టు(Bangalore court) ఆదేశించింది.

అక్రమార్జన ఆరోపణలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై(Nirmala sitaraman) ఎఫ్‌ఐఆర్(Fir) నమోదు చేయాలని బెంగళూరు కోర్టు(Bangalore court) ఆదేశించింది. బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఈ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్ల(Electoral bond) ద్వారా దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలకు సంబంధించి ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. జనాధికార సంఘర్ష్ సంస్థకు చెందిన ఆదర్శ్ అయ్యర్(Aadharsh ayyar).. నిర్మలా సీతారామన్ పై వ్యక్తిగత ఫిర్యాదు దాఖలు చేశారు. విచార‌ణ అనంతరం నిర్మలా సీతారామన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిర్మలా సీతారామన్ పై తిలక్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు.

కేంద్రం 2018లో ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను ప్రారంభించడం గమనార్హం. రాజకీయ పార్టీలకు ఇచ్చే నగదు విరాళాలు, రాజకీయ నిధులలో పారదర్శకతను మెరుగుపరచడం దీని లక్ష్యం. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు నిధులు మంజూరయ్యాయి కానీ ఈ విషయాన్ని ఏ పార్టీలు వెల్లడించలేదు. అయితే.. విపక్షాల ఆరోపణలు, పిటిషన్ల దృష్ట్యా సుప్రీంకోర్టు వీటిని రద్దు చేసింది.

Eha Tv

Eha Tv

Next Story