ఆపిల్‌ ఐ-ఫోన్ 16(Iphone 16) కోసం రాత్రి నుంచే క్యూలైన్‌లో పడిగాపులు పడ్డారు జనం.

ఆపిల్‌ ఐ-ఫోన్ 16(Iphone 16) కోసం రాత్రి నుంచే క్యూలైన్‌లో పడిగాపులు పడ్డారు జనం. శుక్రవారం తెల్లవారు జాము నుంచే దేశ వ్యాప్తంగా ఐ ఫోన్‌ 16 అమ్మకాలు మొదలయ్యాయి. ఫోన్‌ను సొంతం చేసుకోవడం కోసం గురువారం రాత్రి నుంచే షాపుల దగ్గర జనం బారులు తీరారు. ఏఐ సాంకేతిక త‌ర‌హాలో ఆపిల్ ఇంటెలిజెన్స్‌(AI) తో శ‌క్తివంతంగా రూపొందించిన ఈ ఫోన్‌ల‌ను కొనేందుకు ప్రజలు ఆపిల్ స్టోర్‌ల ముందు క్యూలు కట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్ల‌స్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ ప్రో మ్యాక్స్‌.. అనే నాలుగు మోడ‌ళ్ల‌ను ఆపిల్ తీసుకొచ్చింది. వీటిల్లో అధునాత‌న కెమెరా కంట్రోల్ బ‌ట‌న్, యాక్ష‌న్ బ‌ట‌న్ అనే రెండు కొత్త బ‌ట‌న్ల‌ను జ‌త చేశారు. అదే విధంగా ప్ర‌త్యేకంగా త‌యారైన కొత్త చిప్ ఏ18తో వ‌చ్చింది. ఇదిలా ఉండ‌గా.. ఐఫోన్ 16 ప్రారంభ ధ‌ర రూ. 79,900గా, ఐఫోన్ 16 ప్ల‌స్ ప్రారంభ ధ‌ర రూ. 89,900గా, ఐఫోన్ 16 ప్రో ప్రారంభ ధ‌ర రూ. 1,19,900గా, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ప్రారంభం ధ‌ర రూ. 1,44,900గా ఉన్నాయి. ఈ ఫోన్లు 128 జీబీ స్టోరేజీ, 256 జీబీ స్టోరేజీ, 512 జీబీ స్టోేజీ వేరియంట్లలో లభిస్తాయి. ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్లలో ఆపిల్ ఇంటెలిజెన్స్ యూఎస్ ఇంగ్లిష్ వర్షన్ సాఫ్ట్ వేర్ అప్ డేట్ వచ్చేనెలలో అందిస్తుంది.

Eha Tv

Eha Tv

Next Story