జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో(Jarkhand Assembly elections) ఇండియా కూటమి(INDIA Alliance) విజయం సాధించిన విషయం తెలిసిందే.

జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో(Jarkhand Assembly elections) ఇండియా కూటమి(INDIA Alliance) విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే అక్కడ ఇప్పుడో విచిత్ర పరిణామం చోటు చేసుకుంది.

ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ) పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే నిర్మల్ మహతో(Nirmal Mahatho) రాజీనామా చేస్తున్నారు. తన పార్టీ చీఫ్‌ సుదేష్‌ మహతో(sudesh mahto) కోసం ఆయన త్యాగం చేస్తున్నారు. సుదేష్‌ మహతోను అసెంబ్లీకి పంపించడానికి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా(Resign) చేస్తున్నానని ఆయన ప్రకటించారు. సిల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఏజేఎస్‌యూ పార్టీ అధినేత సుదేష్ మహతో ఓటమి పాలయ్యారు. బీజేపీకి(BJP) మిత్రపక్షమైన ఏజేఎస్‌యూ పార్టీ జార్ఖండ్‌లోని 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. పదింటిలో ఒక్కటి మాత్రమే గెల్చుకుంది. అది కూడా కేవలం 231 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో! ఇందులో విజయం సాధించిన నిర్మల్‌ మహతో కూడా ఇప్పుడు రాజీనామా చేయబోతున్నారు. మండూ స్థానం నుంచి ఎన్నికైన ఈయన తన రాజీనామా లేఖను పార్టీ చీఫ్‌ సుదేష్‌ మహతోకు పంపించారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా ఆయనను అభ్యర్థించారు. తద్వారా సుదేష్ మహతో మండూలో జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉంటుందన్నది నిర్మల్‌ భావన! సుదేష్ మహతో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అభ్యర్థి అమిత్ కుమార్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇతనితో పాటు ఏజేఎస్‌యూకి చెందిన మరో 8 మంది అభ్యర్థులు కూడా ఓడిపోయారు. ఉప ఎన్నికల్లో సుదేష్‌ గెలుస్తారా అన్నది అనుమానమే!

Eha Tv

Eha Tv

Next Story