young man married two young women: ఒకే మండపంలో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

young man married two young women: ఒకే మండపంలో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

By :  ehatv
Update: 2025-04-25 05:10 GMT

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఒక యువకుడు ఒకే మండపంలో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న ఘటన జరిగి నెలరోజులు గడవక ముందే మరో ఘటన జరిగింది. జైనూరు మండలం అడ్డెసర గ్రామానికి చెందిన రంభబాయి-బాద్రుషావ్ దంపతుల రెండో కుమారుడు ఆత్రం చత్రుషావ్.. అదే గ్రామానికి చెందిన యువతితో నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. కెరమెరి మండలం సాంగి గ్రామానికి చెందిన బంధువైన మరో యువతిని సైతం ఏడాదిగా ప్రేమిస్తున్నాడు.. 15 రోజుల క్రితం ఆమెతో పెళ్లి చూపులు జరిగాయి. విషయం మొదటి యువతికి తెలియడంతో ఆమె రాయి సెంటర్‌ను ఆశ్రయించారు.. ఇద్దరు అమ్మాయిలూ చత్రుషావ్‌ని పెళ్లి చేసుకుంటామని రాయి సెంటర్ పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఒప్పుకోవడంతో... పెళ్లి పత్రికలు ముద్రించి వివాహం చేయించారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇద్దరినీ చెసుకున్నావని సంబరపడకు సోదరా.. రేపటి నుంచి నీకు ఉంటుంది మిత్రమా.. అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమే ప్రేమ అనే దెబ్బకు రెండు పిట్టలు పడ్డాయి అని వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News