Quality Tests Failed : నాణ్యత పరీక్షలో పారాసెటమాల్ సహా 53 మందులు విఫలం.!

మీకు జ్వరం ఉన్నప్పుడు వెంటనే పారాసెటమాల్ తీసుకుంటారు క‌దా..! అయితే ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి.

Update: 2024-09-25 15:48 GMT

మీకు జ్వరం ఉన్నప్పుడు వెంటనే పారాసెటమాల్ తీసుకుంటారు క‌దా..! అయితే ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. దేశంలోని డ్రగ్ రెగ్యులేటర్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) తాజాగా నెలవారీ ఔషధ హెచ్చరికలను జారీ చేసింది. ఇందులో పారాసిటమాల్ సహా 53 మందులు నాణ్యత పరీక్షలో విఫలమైన‌ట్లు పేర్కొంది. ఈ మందులలో కాల్షియం, విటమిన్ డి3 సప్లిమెంట్లు, యాంటీ-డయాబెటిస్ మాత్రలు, అధిక రక్తపోటు మందులు కూడా ఉన్నాయి.

CDSCO ఈ 53 ఔషధాలపై ప్రామాణిక నాణ్యత లేని(NSQ) మందులుగా ప్రకటించింది. నాణ్యతా పరీక్షలో ఉత్తీర్ణత సాధించని ఔషధాలలో విటమిన్ సి, డి 3 మాత్రలు షెల్కాల్, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి సాఫ్ట్‌జెల్స్, యాంటీ యాసిడ్ పాన్-డి, పారాసెటమాల్ టాబ్లెట్ ఐపి 500 ఎంజి, డయాబెటిస్ మెడిసిన్ గ్లిమిపిరైడ్ ఉన్నాయి.

ఈ ఔషధాలను హెటెరో డ్రగ్స్, ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మెగ్ లైఫ్‌సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్‌కేర్ వంటి కంపెనీలు తయారు చేస్తాయి. కడుపు ఇన్‌ఫెక్షన్‌కు విస్తృతంగా ఉపయోగించే మెట్రోనిడాజోల్ ఔషధం కూడా నాణ్యత పరీక్షలో విఫలమైంది. ఈ ఔషధాన్ని పిఎస్‌యు కంపెనీ హిందుస్థాన్ యాంటీబయాటిక్ లిమిటెడ్ తయారు చేసింది. కానీ, ఈ కంపెనీలు నాణ్య‌త లోపాల‌పై బాధ్యత వహించడం లేదు.

డ్రగ్ రెగ్యులేటర్ నాణ్యత పరీక్షలో విఫలమైన రెండు మందుల జాబితాలను విడుదల చేసింది. మొదటి జాబితాలో 48 ప్రముఖ ఔషధాల పేర్లు ఉన్నాయి. రెండవ జాబితాలో కూడా 5 ఔష‌దాలు ఉన్నాయి. ఇందులో నాణ్యత పరీక్షలో విఫలమైన ఫార్మాస్యూటికల్ కంపెనీలకు ప్రత్యుత్తర విభాగం కూడా ఉంచబడింది. కానీ, ఈ మందులు నకిలీవని పేర్కొంటూ బాధ్యత తీసుకోవడానికి ఆయా కంపెనీలు నిరాకరిస్తున్నాయని దీనికి సంబంధించి వస్తున్న స్పందనలు సూచిస్తున్నాయి. మరి ఈ కంపెనీలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News