Tamilnadu : ఒకేసారి స్పృహ తప్పి పడిపోయిన 29 మంది మహిళలు.. ఏమ‌య్యిందంటే..

ఓ ప్రైవేట్ ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో శుక్రవారం అమ్మోనియా గ్యాస్ లీక్ అవడంతో తమిళనాడులోని కుంభకోణంకు చెందిన ఐదుగురు, ఒడిశా రాష్ట్రానికి చెందిన 16 మంది మహిళా ఉద్యోగులు సహా 29 మంది మహిళలు స్పృహ తప్పి పడిపోయారు.

By :  Eha Tv
Update: 2024-07-20 04:53 GMT

ఓ ప్రైవేట్ ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో శుక్రవారం అమ్మోనియా గ్యాస్ లీక్ అవడంతో తమిళనాడులోని కుంభకోణంకు చెందిన ఐదుగురు, ఒడిశా రాష్ట్రానికి చెందిన 16 మంది మహిళా ఉద్యోగులు సహా 29 మంది మహిళలు స్పృహ తప్పి పడిపోయారు. ప్రైవేట్ ఫిష్ ప్రాసెసింగ్ మరియు ఎగుమతి సంస్థ తూత్తుకుడిలోని పూడూర్ పాండియా పురం ప్రాంతంలో ఉంది. ఇక్కడ తమిళనాడు స‌హా ఇతర రాష్ట్రాల‌కు చెందిన‌ 500 మందికి పైగా మహిళలు పని చేస్తున్నారు.

అయితే శుక్ర‌వారం ప్లాంట్‌లో విద్యుత్ ప్రమాదం కారణంగా అమ్మోనియా గ్యాస్ సిలిండర్ పేలింది. దీని కారణంగా ఫిష్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో అమ్మోనియా గ్యాస్ వ్యాపించింది. దీంతో అక్కడ పనిచేస్తున్న మహిళలు ఊపిరాడ‌క ప‌డిపోయారు. గ్యాక్ లీక్ అయిన వెంట‌నే మ‌హిళ‌లకు ఊపిరాడక‌పోవ‌డం, కంటిలో మంట‌లతో ఇబ్బంది ప‌డుతూ మూర్ఛపోయారు. దీంతో 29 మంది మహిళా ఉద్యోగులను తూత్తుకుడిలోని ఏవీఎం హాస్పిటల్, రాజేష్ తిలక్ హాస్పిటల్, అరుల్‌రాజ్ హాస్పిటల్‌లలో చేర్చారు. ఘటనపై తాళ్లముత్తునగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News