పగిలిన ఫోన్‌తోనే కుస్తీ పడ్డాడు.. కఠోరంగా శ్రమించి నీట్(NEET) పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు.

పగిలిన ఫోన్‌తోనే కుస్తీ పడ్డాడు.. కఠోరంగా శ్రమించి నీట్(NEET) పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. పశ్చిమబెంగాల్‌కు(West bengal) సర్ఫరాజ్(Sarfaraz) 720కి 677 స్కోర్‌తో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ కోసం NEET పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సర్ఫరాజ్ పీఎం ఆవాస్ యోజన(CM Awas Yojna) కింద నిర్మించిన ఇంట్లో ఉంటూ తన తల్లి, తమ్ముడిని పోషించడానికి కూలీగా తన తండ్రితో కలిసి పనిచేశాడు. 21 ఏళ్ల సర్ఫరాజ్‌ తన కుటుంబాన్ని పోషించడానికి రోజుకు ఎనిమిది గంటలు పనిచేశాడని, సాయంత్రం చదువుకునేవాడినని వెల్లడించాడు. ప్రతిరోజూ 200 నుండి 400 ఇటుకలను సర్ఫారాజ్‌ ఎత్తాడు. సరైన స్మార్ట్‌ఫోన్(smart phone) కూడా లేని సర్ఫరాజ్‌కి MBBS కోర్సులో అడ్మిషన్ పొందడం ఎంతో శ్రమకోర్చాడు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా కానీ వెనుకడుగువేయలేదు. ఇంటికి కూడా పైకప్పు లేకుండా ఉంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో, అతను అలఖ్ పాండే(Alakh pandey youtube videos) యూట్యూబ్ వీడియోలు, ఫిజిక్స్ వల్లా కోర్సు నుండి ప్రేరణ పొంది NEET ప్రిపరేషన్‌పై దృష్టి సారించాడు. నీట్ 2023లో ఉత్తీర్ణత సాధించినప్పటికీ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతను డెంటల్ కాలేజీని విడిచిపెట్టాల్సి వచ్చింది. అధైర్యపడకుండా, సర్ఫరాజ్ మరింత కష్టపడి నీట్ 2024లో ఉత్తీర్ణత సాధించి కోల్‌కతాలోని నిల్ రతన్ సిర్కార్ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ పొందాడు. ఫిజిక్స్ వల్లా సీఈఓ అలఖ్ పాండే సర్ఫరాజ్ ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయాన్ని అందించారు. సర్ఫరాజ్‌ కళాశాల ఫీజు కోసం రూ. 5 లక్షల రుణంతో పాటు కొత్త ఫోన్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఈ ఐదు లక్షలు తాను ఎదిగిన తర్వాత మరొకరికి సాయం చేయాలని అలక్ పాండే షరతు విధించారు. సర్ఫరాజ్‌ విజయగాథను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

Eha Tv

Eha Tv

Next Story