ఎన్టీఆర్‌(NTR) నటించిన దేవర(devara) సినిమా విడుదలయ్యింది.

ఎన్టీఆర్‌(NTR) నటించిన దేవర(devara) సినిమా విడుదలయ్యింది. తారక్‌ దున్నేశాడని, అనిరుధ్‌(Anirudh) బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌(Background music) అదిరిపోయిందని అభిమానులు అంటున్నారు. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో అయితే రచ్చ మామూలుగా లేదు. ఆట మొదలయ్యినప్పట్నుంచి అయ్యేంత వరకు ఈలలు, గోలలతో థియేటర్లు మారుమోగుతున్నాయి. వరల్డ్ వైడ్ వేల థియేటర్లలో రిలీజ్ కావడంతో మొదటి రోజు వసూళ్లు బాగానే రాబోతున్నాయని తెలుస్తోంది. దేవర సినిమాకు సంబంధించి అసలైన రివ్యూ రావడానికి కాసేపు పడుతుంది. అయితే దేవర సినిమాకు ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఎవరికి ఎంతెంత రెమ్యూనిరేషన్లు ఇచ్చి ఉంటారనే ఆసక్తి మాత్రం చాలా మందికి కలుగుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ నటించిన సినిమా ఇదే! అరవింద సమేత వీర రాఘవ తర్వాత సోలోగా వచ్చిన సినిమా కూడా ఇదే! ఇంతకు ముందు ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్‌ సినిమా తీసిన కొరటాల శివ దీనికి దర్శకుడు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌తో తీసిన ఈ సినిమాకు సుమారు 300 కోట్ల రూపాయల వ్యయం అయ్యిందట! ఎన్టీఆర్‌ సోదరుడు నందమూరి కల్యాణ్‌రామ్‌, మిక్కిలినేని సుధాకర్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. దేవరలో ద్విపాత్రాభినయం చేసిన ఎన్టీఆర్‌కు పారితోషికంగా 60 కోట్ల రూపాయలు ఇచ్చారట! తెలుగులో మొదటిసారిగా నటిస్తున్న జాన్వీ కపూర్‌కు అయిదు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్‌గా అందించారట!

ప్రతినాయకుడిగా నటించిన బాలీవుడ్‌ నటుడు సైఫ్ అలీ ఖాన్‌కు 10 కోట్ల రూపాయలు, ఇతర కీలక పాత్రలు పోషించిన ప్రకాశ్ రాజ్‌కు కోటిన్నర, శ్రీకాంత్ 50 లక్షలు, మురళీశర్మకు 40 లక్షల రూపాయలు ఇచ్చారని అంటున్నారు. ఇక దర్శకుడు కొరటాల శివ 30 కోట్ల రూపాయలు తీసుకున్నాడని సమాచారం!

Eha Tv

Eha Tv

Next Story