VIjay - Trisha : విజయ్‌, త్రిష మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌...

తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌, ముగ్ధ మనోహరం త్రిష కలిసి నటించిన సినిమాలన్నీ హిట్‌ కొట్టాయి. అందుకే వీరు హిట్‌ పెయిర్‌గా పేరు సంపాదించుకున్నారు.

By :  Eha Tv
Update: 2024-06-25 11:22 GMT

తమిళ స్టార్‌ హీరో దళపతి విజయ్‌, ముగ్ధ మనోహరం త్రిష కలిసి నటించిన సినిమాలన్నీ హిట్‌ కొట్టాయి. అందుకే వీరు హిట్‌ పెయిర్‌గా పేరు సంపాదించుకున్నారు. కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలోనే విజయ్‌ పాలిటిక్స్‌లో ప్రవేశించాడు. సొంతంగా పార్టీ పెట్టాడు. త్వరలో సినిమాకు గుడ్‌బై చెప్పనున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. విజయ్‌ నటించబోయే చివరి సినిమాలో కూడా త్రిషనే కథానాయికగా నటిస్తుందని అంటున్నారు కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. కొద్ది రోజుల కిందట విజయ్‌ తన 50వ పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఈ సందర్భగా విజయ్‌కు త్రిష శుభాకాంక్షలు తెలుపుతూ వారిద్దరు లిఫ్ట్‌లో ఉన్న ఓ ఫోటోను జత చేసింది. పైగా నీ ధాన్‌ ఎన్‌ కాదల్‌, టిల్‌ డెత్‌ నీ థాన్‌ ఎన్‌ కాదల్ అంటూ ఓ పాటను కూడా పోస్ట్‌ చేసింది. త్రిష పెట్టిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో నెటిజన్లు కూడా త్రిష-విజయ్‌ కలిసి ఉన్న ఫోటోలను వైరల్‌ చేస్తున్నారు. చాలా సందర్భాలలో ఇద్దరూ కలిసే విదేశాలకు వెళ్లారని చెబుతున్నారు. ఇందుకు సాక్ష్యంగా ఓ పాత ఫోటోను వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోలో విజయ్ ఒంటరిగా నడుస్తున్నాడు. మరో ఫోటోలో త్రిష పక్కన ఒక కాలుతో ఉన్న ఫోటో ఉంది. ఈ రెండూ కలిపి నెట్టింట వైరల్ చేస్తున్నారు. మొదటి ఫోటోలో విజయ్‌ ధరించిన షూ నే త్రిష కూర్చున్న పక్కన కనిపిస్తుంది. విజయ్‌, త్రిష తరచూ విదేశాలకు వెళుతుంటారనేది ఫ్యాన్స్‌ అంటున్నారు. వీరిద్దరి మధ్య గాఢమైన స్నేహం ఉందనే చర్చ జరుగుతోంది. విజయ్‌ ఇదివరకే సంగీతను పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఓ కొడుకు కూడా ఉన్నాడు. ప్రస్తుతం సంగీత అమెరికాలో ఉంటున్నారు. గత కొంతకాలంగా వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. విడాకులు తీసుకోనున్నారనే వదంతులు కూడా వినిపించాయి. 41 ఏళ్ల వయసులో కూడా త్రిష అందంగా, గ్లామరస్‌గా ఉంది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో బిజీగా ఉంది.

చాలా కాలం క్రితం వరుణ్‌ మణియన్‌ అనే నిర్మాత, వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగింది. పెళ్లి వరకు వెళ్లి బ్రేక్‌ పడింది. ఆ తరువాత నటిగానూ కొన్ని స్ట్రగుల్స్‌ ఎదుర్కొన్న త్రిష ఇటీవల వెండితెరపై తన సత్తా చాటుతుంది. సౌత్‌ ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్‌ అందుకే హీరోయిన్‌గా ప్రస్తుతం రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. త్రిష, విజయ్‌ మధ్య సమ్‌థింగ్‌ ఉందనే డౌట్ వచ్చేలా కొన్ని ఫోటోలు షేర్‌ చేస్తున్నారు. విజయ్‌ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి కొందరు కావాలనే ఇలాంటి పని చేస్తున్నారని విజయ్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు.విజయ్‌, త్రిష మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌...

Tags:    

Similar News