సినిమా పెద్దల హుకుం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో(Telugu industry) మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, లైంగిక పరమైన దాడులు జరిగినా రెడ్‌ బాక్స్‌ ఒకటి పెట్టామని, అందులో కంప్లయింట్‌ చేయండి అని సినిమా రంగ పెద్దలు చెబుతున్నారు. మిగతా సంగతి తాము చూసుకుంటామని బాధిత మహిళలకు భరోసా ఇస్తున్నారు. అంతే తప్ప మీడియా(Media) ముందుకు మాత్రం వెళ్లకూడదంటూ గట్టిగా చెబుతున్నారని వినికిడి. నిజానికి కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్(Jani master) కేసు కూడా రెండు వారాల పాటు సినిమా పెద్దల దగ్గర తిరిగిందట! మీడియాకు అసలు తెలియనియ్యకుండా చాలా జాగ్రత్త పడ్డారట! ఒకరిద్దరు జర్నలిస్టులకు అనుమానం వచ్చి సినిమా రంగ పెద్దలను అడిగితే , అలాంటిదేమీ లేదని చెప్పారట! బాధితురాలు పోలీసుస్టేషన్కు వెళితే కానీ జర్నలిస్టులకు విషయం తెలియరాలేదు. అప్పుడు సినిమా పెద్దలు మీడియా ముందుకొచ్చి కాసింత హడావుడి చేశారు. జానీ మాస్టర్‌ కాంట్రవర్సరీ తర్వాత నటి పూనమ్‌కౌర్‌(Poonam kaur) ఓ ట్వీట్‌ చేశారు. త్రివిక్రమ్‌ను(Trivikram) కూడా ప్రశ్నించండి అంటూ ఆమె అందులో పేర్కొన్నారు. ఆ తర్వాత ఓ మెయిల్‌న్‌ సినిమా పెద్దలకు పంపించారు. దాంతో అలెర్టయిన ఆ పెద్దలు పూనమ్‌తో సంప్రదింపులు మొదలుపెట్టారట! మీడియా ముందుకు అసలు వెళ్లకూడదని, మీడియాకు ఏమీ చెప్పకూడదని, మీడియాకు ఎలాంటి మెటీరియల్‌ ఇవ్వకూడదని పూనమ్‌ కౌర్‌కు సినిమా పెద్దలు హెచ్చరికలాంటి సలహా ఇచ్చారట! డ్యాన్సర్స్‌ యూనియన్‌ వాట్సప్‌ గ్రూపుల్లో వచ్చిన వాయిస్‌ మెసేజ్‌లు కూడా సినిమా పెద్దల తీరును చాటిచెబుతున్నాయి. జానీ మాస్టర్‌ విషయం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎవరూ ఏమీ మాట్లాడవద్దని సినిమా రంగ పెద్దలు చెప్పారంటూ ఓ యూనియన్‌ నాయకుడు పెట్టిన వాయిస్‌ మెసేజ్‌ అది. అంటే విషయాలు మీడియాలోకి రాకుండా సినిమా పెద్దలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న

Eha Tv

Eha Tv

Next Story