అల్లు అర్జున్ సినిమా పుష్ప 2పై ట్రోల్ మొదలయ్యింది. మెగా హీరోల అభిమానులు ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ సినిమా పుష్ప 2పై ట్రోల్ మొదలయ్యింది. మెగా హీరోల అభిమానులు ఉద్దేశపూర్వకంగా ట్రోలింగ్ చేస్తున్నారు. తెలుగుదేశంపార్టీ వాళ్లు కూడా పుష్ప 2పై నెగటివ్ క్యాంపైన్ షురూ చేశారు. కొన్ని రోజులుగా ఈ తంతు నడుస్తూ వస్తున్నది. ఈ అగ్నిలో ఆజ్యం పోయడానికి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా వచ్చాడు. ఓ ట్వీట్‌తో ఆయన మెగా అభిమానులకు మంట పుట్టేలా చేశాడు. 'అల్లు(Allu) మెగా కంటే చాలా రెట్లు ఎక్కువ.. గ్లోబల్ స్టార్ కంటే ఎక్కువే.. అల్లు అర్జున్(Aluu Arjun) ప్లానెట్ స్టార్ అనడానికి 3 కారణాలు.పుష్ప 2 భారతీయ సినిమా చరిత్రలో ఏ సినిమాకు లేని క్రేజ్‌తో రిలీజ్ కాబోతుంది. మొదటి రోజు దాని కలెక్షన్లు బాక్సాఫీస్ యూనివర్స్ స్ట్రాటోస్పియర్‌ను విచ్ఛిన్నం చేస్తాయి. బ్లాక్ బాస్టర్ హిట్ పక్కా. ప్రపంచవ్యాప్తంగా ప్లానెట్ స్టార్ అని పిలిచే ఏకైక స్టార్ అల్లు అర్జున్. ఎందుకంటే, బన్నీ మూవీ పుష్ప2 ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రభంజనాన్ని సృష్టించడం పక్కా.అలానే బన్నీ సినిమా భారీ బడ్జెట్‌తో తీశారు. ఇది మెగా మెగా కంటే మెగా రెట్లు ఎక్కువ. సినిమా చరిత్రలో ఏ స్టార్ కూడా ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకోలేదు, అందుకే ఇతడు నిజమైన టవర్ స్టార్' అని వర్మ తన ఎక్స్ అకౌంట్‌లో రాసుకొచ్చాడు.