Atlee Next Movie : రజనీ-సల్మాన్‌లతో అట్లి సినిమా!

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) క్రేజ్‌ మామూలుగా ఉండదు. తెలుగు, కన్నడ భాషల్లోనూ రజనీకి కోట్లాది మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆ మాటకొస్తే నార్త్‌ ఇండియాలో కూడా రజనీ అంటే తెలియనివారు ఉండరు.

By :  Eha Tv
Update: 2024-06-24 11:53 GMT

తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) క్రేజ్‌ మామూలుగా ఉండదు. తెలుగు, కన్నడ భాషల్లోనూ రజనీకి కోట్లాది మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆ మాటకొస్తే నార్త్‌ ఇండియాలో కూడా రజనీ అంటే తెలియనివారు ఉండరు. జపాన్‌లో అయితే రజనీ అంటే పడిచస్తారు. హాలీవుడ్‌లోనూ నటించాడు రజనీకాంత్‌. ఇక బాలీవుడ్‌ టాప్‌ స్టార్ సల్మాన్‌ఖాన్(Salman Khan) గురించి చెప్పేదేముంది? అతడికి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ ఉంది. ఈ ఇద్దరు స్టార్లు ఒకే సినిమాలో నటిస్తే ఎలా ఉంటుంది? బాక్సాఫీసు షేక్‌ కాకుండా ఉంటుందా? అభిమానులకు అంతకంటే కావాల్సిందేముంటుది? వీరిద్దరి కలయికలో త్వరలో ఓ సినిమా రాబోతున్నది. రజనీకాంత్‌, సల్మాన్‌ఖాన్‌లతో సినిమా తీయబోయే దర్శకుడు ఎవరంటే అట్లీ(Atlee). లాస్టియర్‌ జవాన్‌ తీసి బాలీవుడ్‌లోనూ పాగా వేశాడీ యంగ్‌ డైరెక్టర్‌. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా ఇంకా పట్టాలే ఎక్కలేదు కానీ అప్పుడే కలెక్షన్లను ఊహించేసుకుంటున్నారు. ఈజీగా 1500 కోట్ల రూపాయలు కొల్లగొడుతుందని సవాళ్లు విసురుకుంటున్నారు.

Tags:    

Similar News