Anasuya Bharadwa : పోటీ పడి మరీ బట్టలు విప్పేస్తున్న అనసూయ...!
తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకునే ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మళ్లీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది.
తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకునే ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్(Anasuya Bharadwaj) మళ్లీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది.సోషల్ మీడియాలో ఆమె పేరు మారుమోగుతోంది. స్టార్ మా ఛానెల్(Star Maa Channel)లో కొత్తగా మరో గేమ్ షో ప్రారంభం కాబోతున్నది. దాని పేరు కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ (Kiraak Boys Khiladi Girls) . ఈ నెల 29వ తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానుంది. శని, ఆదివారాలలో రాత్రి 9 గంటలకు ఈ షో ప్రసారమవుతుది. ఇప్పటికే ఈ గేమ్ షోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఖిలాడీ భామలందరి హెడ్ అనసూయ అయితే, బాయ్స్‌కు శేఖర్ మాస్టర్ లీడరన్నమాట! గెలిచిన టీమ్‌కు 20 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఉంటుంది. ఇక ఈ షోలో అనసూయ గెటప్ అదిరిపోయింది. ప్రోమోలో కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌తో పోటీపడుతూ అనసూయ కూడా తన ఒంటిపై ఉన్న వస్త్రాలను ఒక్కొక్కటిగా విప్పేస్తుంది. అలా విప్పుతూ విప్పుతూ ఒంటిపై బ్రా మాత్రమే మిగిలింది. పైగా వీళ్లిద్దరూ పోటీపడి బట్టలు విప్పుకుంటుంటే పక్కనుంచి శ్రీముఖి అరుపులు, కేకలు.. ఆ తర్వాత ఏం జరిగి ఉంటుందన్నది సస్పెన్స్. అక్కడి వరకే ప్రోమోను కట్ చేశారు. మధ్య మధ్యలో ముద్దులు, రొమాన్స్‌లు కూడా ఉన్నాయి. ఇది గేమ్ షోనేనా? మరోటా? అన్న డౌటానుమానం కూడా వచ్చేస్తుంది.
ఈ ప్రోమోను చూసి చాలా మంది నెటిజన్లు అనసూయను విమర్శించడం మొదలుపెట్టారు. ఈ ప్రోమోను పోస్ట్ చేసిన ఓ నెటిజన్ 'ఏంటి ఈ చండాలం అనసూయ? ఏమైనా అంటే విక్టిమ్ కార్డు ప్లే చేస్తారు? అంటూ వాంతి చేసుకుంటున్ ఎమోజీలను షేర్ చేశాడు. దానికి అనసూయ ఘాటుగానే స్పందించింది. ఎక్స్‌క్యూజ్‌మీ.. మీరు ఎందుకింత అనారోగ్యంతో ఉన్నారో తెలుసుకోవచ్చా ? మీ మైండ్ కూడా మీ ఎమోజీల్లాగే ఉందనిపిస్తున్నది అని జవాబిచ్చారు. దీనికి మరో నెటిజన్ రియాక్టయ్యాడు. నీకు నిజంగా అర్థం కావడం లేదా అండి. ఎలా ఉండే షోలు ఎలా అవుతున్నాయో.. వీటిల్లో మీ పాత్ర మంచిగా ఉండాలి కాన చాలా బ్యాడ్‌గా వెళుతున్నది. నటిగా మిమ్మల్ని మేము ఆరాధిస్తాం కానీ ఇలాంటి ప్రొగ్రామ్‌లు చేయకుండా ఉంటేనే మంచిది అని ఓ సూచన చేశాడు. దీనికి కూడా అనసూయ జవాబిచ్చింది. ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో ఉన్నవారు ప్రేక్షకుల అభిరుచి మేరకు, కాలానికి అనుగుణంగా కొన్ని విషయాలను విశ్లేషించుకుంటారు. అయినా మీ ప్రతాపం అంతా బుల్లితెరకే పరమితమా? పెద్ద తెర (సినిమా) మీద ఎన్నో అభ్యంతరకరమైనవి వస్తున్నా ఏ మాత్రం పట్టించుకోరు. పైగా వాటిని బ్లాక్‌బస్టర్స్ చేస్తారు. షో ఆసాంతం చూసే వరకు కూడా మీ తీర్పులు ఆగడం లేదు. అది కేవలం ప్రోమో మాత్రమే. అయినా అందులో అంత ఇబ్బందికరంగా ఏముందో అది వారి వారి లిమిట్స్‌కి పరిమితం కదండి. కొందరికీ ఫ్యాంట్, షర్ట్ కూడా చాలా ఇబ్బందే.. నేను చెబుతున్నది మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నా' అంటూ అనసూయ గట్టి జవాబు ఇచ్చింది.