అక్షయ్ కుమార్ రీమేక్ లు చేయకపోవడమే బెటర్ అంటున్నారే.!

ప్రముఖ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌ ఒకప్పుడు వరుసగా హిట్ సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో టాప్ పొజిషన్ కు చేరుకున్నాడు

By :  Eha Tv
Update: 2024-07-13 16:52 GMT

ప్రముఖ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌ ఒకప్పుడు వరుసగా హిట్ సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో టాప్ పొజిషన్ కు చేరుకున్నాడు. అయితే ఇప్పుడు వరుస ఫ్లాప్ లను అక్షయ్ కుమార్ ఎదుర్కొంటూ ఉన్నాడు. ఒక్క హిట్ కూడా అక్షయ్ కు పడడం లేదు. ఎన్ని రీమేక్ లు చేసినా కూడా సక్సెస్ అన్నది దక్కడం లేదు. తాజాగా మరో ఫ్లాప్ ను మూటగట్టుకున్నాడు అక్షయ్ కుమార్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఈ శుక్రవారం అక్షయ్ హీరోగా నటించిన "సర్ఫిరా" సినిమా విడుదలైంది. ఈ సినిమా కలెక్షన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. అక్షయ్ కుమార్ చిత్రం మొదటి రోజున భారతదేశంలో కేవలం ₹2.40 కోట్లు మాత్రమే వసూలు చేసింది. "సర్ఫిరా" సినిమా సూర్య నటించిన "ఆకాశం నీ హద్దు రా" సినిమా అధికారిక హిందీ రీమేక్. ఒరిజినల్‌కి దర్శకత్వం వహించిన సుధా కొంగర దీనిని హిందీలో రీమేక్ చేసారు. అయితే అక్షయ్ కుమార్ సినిమాను చూడటానికి బాలీవుడ్ ప్రేక్షకులే ఆసక్తి చూపలేదు. సౌత్ ఇండియన్ సినిమాలను రీమేక్ చేయడం మానేసి ఒరిజినల్ స్క్రిప్ట్‌లను ఎంచుకోవాలని ఆయన అభిమానులే అక్షయ్ కుమార్‌ను అభ్యర్థిస్తున్నారు.

Tags:    

Similar News