మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram charan) ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో(Ayyappa deeksha) ఉన్నారు.
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram charan) ప్రస్తుతం అయ్యప్ప దీక్షలో(Ayyappa deeksha) ఉన్నారు. మాల వేసుకున్నారు. ఆయన కడప పెద్ద దర్గాకు(Darga) వెళ్లారు. చాదర్‌ను సమర్పించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. రామ్‌చరణ్ ఉర్సు వేడుకలలో(Ursu Celebrations) పాల్గొనడమే వివాదాస్పదమయ్యింది. మాలలో ఉంటూ ఉర్సు ఉత్సవాల్లో ఎలా పాల్గొంటారన్నది హిందూ సంఘాల ప్రశ్న. రామ్‌చరణ్ సతీమణి ఉపాసన(Upasana) దీనిపై వివరణ ఇచ్చుకున్నా వెనక్కి తగ్గడం లేదు. రామ్‌చరణ్ క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు. దర్గా లోపలికి వెళ్లినప్పుడు బొట్టును తుడిపించారని, మాల వేసుకున్నాక నియమ నిబంధనలు ఉంటాయని, అశుభం జరిగినప్పుడు మాత్రమే మాల, బొట్టు తీస్తారని అయ్యప్ప స్వామి సంఘాలు అంటున్నాయి. రామ్‌చరణ్‌కి అయ్యప్ప మాల వేసిన గురుస్వామి జ్ఞానోదయం కల్పించాలని చెబుతున్నాయి. దీనిపై రామ్‌చరణ్ వివరణ ఇవ్వాలని, క్షమాపణ(Apology) చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అయ్యప్ప భక్తులు. దర్గాకు వచ్చేవారు తక్కువ అయ్యారనే ఏఆర్ రెహమాన్ కుట్ర పూర్వకంగానే రామ్‌చరణ్‌ను దర్గాకు వెళ్లమన్నారని ఆరోపిస్తున్నారు. రెహమాన్‌ని కూడా శబరిమలకు నిష్ఠగా మాల వేసుకుని తీసుకురాగలరా అని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే రామ్‌చరణ్ అయ్యప్ప మాలలో దర్గాకు వెళ్లడమేమిటని ప్రశ్నిస్తున్నారు. వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని, రామ్‌చరణ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయన అయ్యప్ప ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.
ఇక్కడో విషయం చెప్పుకోవాలి. అయ్యప్ప మాల వేసిన భక్తులు శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి ముందు వావర్ మసీదుకు వెళతారు. అయ్యప్ప స్వామిని, వావర్ స్వామిని ప్రార్థిస్తూ భక్తులు జయజయధ్వానాలు చేస్తారు. మసీదులో ప్రదక్షిణలు చేసి, విభూది, మిరియాల ప్రసాదం తీసుకుని శబరిమల యాత్రను కొనసాగిస్తారు. భక్తులు తమ తమ సంప్రదాయాలను అనుసరించి మసీదులో పూజలు చేస్తారు. కొందరు అక్కడే నమాజు కూడా చేస్తారు. మసీదులో ప్రదక్షిణలు చేసే సంప్రదాయం గత 500 ఏళ్లకు పైగా ఉంది. ఏటా శబరిమల ఆలయంతో మసీదుకు ఉన్న సంబంధాలను చెప్పేలా మసీదు కమిటీ ఒక ఉత్సవం నిర్వహిస్తుంది. ఈ వేడుకను చందనకూడమ్ అంటారు. అంటే చందనం-కుంకుమ అన్నమాట!