ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 ఫీవర్‌ మొదలయ్యింది. దేశమంతటా ఈనెల 5వ తేదీన సినిమా విడుదల కాబోతున్నది.

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా, సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 ఫీవర్‌ మొదలయ్యింది. దేశమంతటా ఈనెల 5వ తేదీన సినిమా విడుదల కాబోతున్నది. డిసెంబర్‌ 4వ తేదీ రాత్రి 9.30 గంటలకు ప్రదర్శితమవుతున్న ప్రత్యేక షోకు డిమాండ్‌ బాగా పెరిగింది. ఇప్పటికే అడ్వాన్స్‌ సేల్స్‌ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. బుక్ మై షో బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఇప్పటి వరకు కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ లోనే పది లక్షల టికెట్స్ సేలయ్యాయి. బుక్ మై షో(Book my Show) లో అత్యంత వేగంగా వన్‌ మిలియన్ అడ్వాన్స్ బుకింగ్స్ రాబట్టిన సినిమాగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది. సినిమా విడుదల నాటికి ఈ బుకింగ్స్ 20 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది.ఇక్కడే కాదు, ఉత్తర భారతంలోనూ అడ్వాన్స్‌ బుకింగ్‌ అదిరిపోతున్నది. కేరళలోను అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. ఒక్క కేరళలోనే తెల్లవారుజాము 4.00 గంటల షోను 100 పైగా ప్రదర్శించేందుకు థియేటర్స్ ను లాక్ చేశారు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌. ఇవన్నీ చూస్తుంటే మొదటి రోజే కలెక్షన్‌ సునామా సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ehatv

ehatv

Next Story