పెద్ద సినిమా రిలీజయ్యిందంటే చాలు థియేటర్ల(theaters) ముందు ప్రేక్షకులతో సరి సమానంగా యూ ట్యూబర్లు(Youtubers) ఉంటున్నారు.

పెద్ద సినిమా రిలీజయ్యిందంటే చాలు థియేటర్ల(theaters) ముందు ప్రేక్షకులతో సరి సమానంగా యూ ట్యూబర్లు(Youtubers) ఉంటున్నారు. ఇలా థియేటర్ల బయట నిలబడి వచ్చిపోయేవారితో మూవీ గురించి చెప్పించి రివ్యూలు ఇవ్వకుండా చూడాలని థియేటర్ల యజమానులను తమిళనాడు ప్రొడ్యూసర్‌ కౌన్సిల్ కోరింది. థియేటర్ల ముందుకు యూట్యూబర్లు రాకుండా నిషేధం విధించాలని విన్నవించుకుంది. ఫస్ట్ డే ఫస్ట్ షో రోజే థియేటర్ల దగ్గర నిలబడి హాల్‌లో నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకుల నుంచి రివ్యూ(Review) తీసుకోవడం సరికాదని, దీని వల్ల సినిమాలకు నష్టం కలుగుతున్నదని టీఎన్‌పీసీ అభిప్రాయపడింది. ప్రేక్షకులు కూడా యూట్యూబర్లకు రివ్యూలు ఇవ్వడం మానేయాలని కోరింది. పైపెచ్చు రివ్యూ ఇస్తున్న సమయంలో సినిమాలో నటించిన వాళ్లను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని తమిళనాడు ప్రొడ్యూసర్‌ కౌన్సిల్(Tamilnadu producer council) తెలిపింది. ఇదే నిర్ణయానికి తెలుగు రాష్ట్రాలలో కూడా అమలు చేయనున్నట్టు ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు తెలిపారు. ఇప్పటికే ఫిల్మ్‌ ఛాంబర్‌, ఎగ్జిబిటర్లతో చర్చించామని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని దిల్‌ రాజు తెలిపారు. యూట్యూబ్‌‌‌‌‌‌‌‌ రివ్యూల కారణంగానే ఇండియన్‌‌‌‌‌‌‌‌–2(Indian-2), వెట్టాయన్‌(Vettayan)‌‌‌‌‌‌‌, కంగువా(Kanguva) సినిమాలు సరిగ్గా ఆడలేదన్న టీఎన్‌పీసీ అభిప్రాయాన్ని దిల్ రాజు(Dl raju) సమర్థించారు. తెలుగులో మిస్టర్‌ బచ్చన్‌, డబుల్ ఇస్మార్ట్‌, గుంటూరు కారం వంటి సినిమాపై నెగటివ్‌ రివ్యూల ఎఫెక్ట్ పడిందన్నది నిర్మాతల అభిప్రాయం. థియేటర్ల దగ్గరకు యూ ట్యూబర్లను రానివ్వరు సరే, సోషల్‌ మీడియాలో రివ్యూలను ఎలా ఆపుతారన్నదే ప్రశ్న! థియేటర్‌ దగ్గరలో ఉన్న టీ స్టాల్‌లోనో, రోడ్డు మీద రివ్యూలు తీసుకోవడాన్ని ఎలా అడ్డుకుంటారు? ఫేస్‌బుక్‌లో వచ్చే రివ్యూలను ఆపగలరా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. యూ ట్యూబ్‌లు గట్రాలు లేని రోజుల్లో కూడా చాలా సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి కదా అన్నది కొందరి పాయింటూ! నిజమే కదా! సినిమా బాగుంటే రివ్యూవర్లు ఎంత చెప్పినా ఆడి తీరుతుంది. కాదంటారా?

Eha Tv

Eha Tv

Next Story