Viral Video : థియేటర్ సిబ్బందిని చితకబాదిన ఎన్టీఆర్ ఫ్యాన్స్

ఎన్టీఆర్ న‌టించిన‌ దేవ‌ర సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. తెలుగు రాష్ట్రాల‌లో కూడా అర్ధ‌రాత్రి నుంచే థియేట‌ర్ల వ‌ద్ద అభిమానుల‌ సందండి మొద‌ల‌య్యింది.

Update: 2024-09-27 03:30 GMT

ఎన్టీఆర్ న‌టించిన‌ దేవ‌ర సినిమా ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజైంది. తెలుగు రాష్ట్రాల‌లో కూడా అర్ధ‌రాత్రి నుంచే థియేట‌ర్ల వ‌ద్ద అభిమానుల‌ సందండి మొద‌ల‌య్యింది. అయితే ప‌లు చోట్ల ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. కడపలోని రాజా థియేటర్ వద్ద జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. థియేటర్ సిబ్బందిని చితకబాదారు. 'దేవర' రిలీజ్ షో సందర్భంగా చాలామంది అభిమానులు టికెట్ లేకుండానే థియేటర్లోకి దూసుకొచ్చారు. వారిని ఆపే క్రమంలోనే ఫ్యాన్స్, థియేటర్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలోనే కొంతమంది అభిమానులు సిబ్బందిని చితకబాదారు. దీంతో నిర్వాహకులు షోను నిలిపేశారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్ అవుతుంది.


Tags:    

Similar News