Urvashi Rautela : బాలీవుడ్‌ నటి బాత్‌రూమ్‌ వీడియో లీక్‌...

బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా బాత్‌రూమ్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ సంఘటన జరిగిన మర్నాడే ఆమె తన మేనేజర్‌తో మాట్లాడిన కాల్‌ రికార్డింగ్‌ కూడా బయటకొచ్చింది.

By :  Eha Tv
Update: 2024-07-28 10:17 GMT

బాలీవుడ్‌ నటి ఊర్వశి రౌతేలా(Bollywood Actress Urvashi Rautela) బాత్‌రూమ్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియా(Social Media)లో వైరల్‌ అవుతోంది. ఈ సంఘటన జరిగిన మర్నాడే ఆమె తన మేనేజర్‌తో మాట్లాడిన కాల్‌ రికార్డింగ్‌ కూడా బయటకొచ్చింది. ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందంటూ మేనేజర్‌ను ఊర్వశి అడుగుతున్నట్టుగా అందులో ఉంది. అటు వీడియో, ఇటుఆడియో రెండింటితో ఊర్వశి హాట్‌ టాపిక్‌ అయ్యింది. వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) పక్క ఐటమ్‌సాంగ్‌(Item Song) చేసిన ఊర్వశి అలా తెలుగువారికి కూడా పరిచయం అయ్యింది. బాత్‌రూమ్‌ వీడియోపై పెద్ద చర్చ సాగుతుండటంతో ఆమె రియాక్టవ్వక తప్పలేదు. 'నేను బాలీవుడ్‌లో గుస్పేటియా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో భాగంగా ఓ సీన్‌ కోసం అలా నటించాను. కానీ, అది ఇటీవల నెట్టింట లీక్‌ కావడంతో నేను చాలా బాధపడ్డాను. కనీసం సినిమా చిత్రీకరణ పూర్తి కాలేదు.. అప్పుడు ఇలా వీడియోలు, ఫోటోలు లీక్‌ కావడం విచిత్రంగా ఉంది. అయితే, నేను అందరికీ చెప్పేది ఒక్కటే.. ఆ వీడియో నా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది కాదు. మరొకరికి ఇలాంటివి జరగకూడదని కోరుకుంటున్నా' అని ఊర్వశి తెలిపారు. ఇక్కడే నెటిజన్లకు కోపం వచ్చింది. వీడియో లీక్‌ అయ్యింది బాగానే ఉంది. మరి మేనేజర్‌తో మాట్లాడిన కాల్ ఎలా లీక్‌ అయ్యిందో చెప్పండంటూ నెటిజన్లు అడుగుతున్నారు. సినిమా ప్రమోషన్ల కోసం ఇలాంటి నాటకాలు ఆడతారా అని ఫైరవుతున్నారు. బాత్‌రూమ్‌ వీడియో లీక్‌ చేసుకుంటూ సినిమా ప్రమోషన్‌ చేసుకునే స్థాయికి చేరావా..? అంటూ ఆమెను తిడుతున్నారు. గుస్పేటియా సినిమా వచ్చే నెల 9వ తేదీన విడుదల కానుంది. అక్షయ్‌ ఒబెరాయ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సూషి గణేషన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో బాలకృష్ణ నటిస్తోన్న 109 చిత్రంలో కూడా ఊర్వశి రౌతేలా నటిస్తుంది.

Tags:    

Similar News