ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(AR Rehman), సైరా బాను(Syrabanu) దంపతులు విడాకులు(Divorce) తీసుకుంటున్నారన్న వార్త సంచలనం రేకెత్తించింది
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్(AR Rehman), సైరా బాను(Syrabanu) దంపతులు విడాకులు(Divorce) తీసుకుంటున్నారన్న వార్త సంచలనం రేకెత్తించింది. అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి ఎవరికి తోచిన కథను వారు రాస్తున్నారు. రెహమాన్దే తప్పంటూ తమిళ మీడియా చెబుతోంది. ఇక అక్కడి యూ ట్యూబ్ చానెల్స్ అయితే లేనిపోనివన్నీ చెబుతూ ఇష్టం వచ్చిన కథనాలను ప్రసారం చేస్తున్నాయి. ఇవన్నీ చూసి సైరా బాను కలత చెందారు. రెహమాన్ గురించి చెత్త రాస్తే ఊరుకునేది లేదన్నారు. 'రెహమాన్ చాలా మంచి వ్యక్తి. ఆయన గురించి తెలియకుండా తప్పుగా ప్రచారం చేయడం బాధగా ఉంది. పలు అనారోగ్య కారణాలతో నేను ఇప్పుడు ముంబైలో ఉన్నాను. కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలతో(Health issues) ఇబ్బంది పడుతున్నాను. ఈ కారణం వల్లే ఆయనకు దూరంగా ఉండాలని నేనే కోరుకున్నా. పూర్తి విషయాలు తెలుసుకోకుండా కొందరు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. మీడియాతో పాటు యూట్యూబ్ వారికి నా విన్నపం. దయచేసి ఆయన గురించి చెడుగా ప్రచారం చేయకండి. ప్రపంచంలో ఆయనకు ఉన్న మంచి గుర్తింపును చెడగొట్టకండి. ఇప్పటికీ ఆయనంటే నాకు చాలా ఇష్టం. నాపై కూడా ఆయనకు ఎనలేని ప్రేమ ఉంది. ఇకనైనా తప్పుడు కథనాలకు ఫుల్స్టాప్ పెడుతారని అనుకుంటున్నాను. మేమిద్దరం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలాంటి ఇబ్బందికరమైన సమయంలో మా గోప్యతను కాపాడండి. కొద్దిరోజుల్లో నేను చెన్నయ్ వస్తాను.' అని సైరా బాను సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు.