సౌతిండియా స్టార్ కమలహాసన్(Kamal haasan) నటనావైదుష్యం గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు.
సౌతిండియా స్టార్ కమలహాసన్(Kamal haasan) నటనావైదుష్యం గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. ఆ మాటకొస్తే బాలీవుడ్‌లోనూ(Bollywood) ఆయన తన సత్తా చాటుకున్నారు. సుదీర్ఘకాలంగా ఇండస్ట్రీలో ఉంటూ వస్తున్న కమలహాసన్ విక్రమ్(Vikram) సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చారు. ఆ సినిమా కమలహాసన్ స్టామినా ఏమిటో రుజువు చేసింది. అయితే భారతీయుడు-2(Indian-2) సినిమా మాత్రం దెబ్బేసింది. కల్కి(Kalki) సినిమాలో విభిన్నపాత్రలో కనిపించారు. లేటెస్ట్‌గా కమలహాసన్ ఎక్స్ ద్వారా అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేశారు. అదిప్పుడు వైరల్ అవుతోంది. 'నా నటనకు మెచ్చి ఉలగనాయగన్(Ulaganayagan) వంటి ఎన్నో బిరుదులు నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రేక్షకులు, సహ నటీనటులు, ఆత్మీయులు నుంచి ఇలాంటి ప్రశంసలు నన్నెంతగానో కదిలించాయి. సినిమాకు సంబంధించినంత వరకు నేను నిత్య విద్యార్థిని. ఇండస్ట్రీలో ఎన్నో విషయాలు నేర్చుకోవాలని, మరింత ఎదగాలని ఆశిస్తున్నాను. కళ కంటే కళాకారుడు గొప్ప కాదనేది నా నమ్మకం. ఎంతో ఆలోచించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నాను. స్టార్ ట్యాగ్స్‌ని(Sta) మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తున్నాను. నా అభిమానులు, మీడియా, సినీ ప్రముఖులు.. నన్ను కమలహాసన్ లేదా కమల్ లేదా కేహెచ్ అని పిలవండి చాలు. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి బిరుదులతో మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలకు థ్యాంక్స్. మూలాలకు కట్టుబడి ఉండాలని, నటుడిగా బాధ్యత నిర్వర్తించాలని అనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను' అంటూ ట్వీట్ చేశారు కమలహాసన్. ఇంతకు ముందు కోలీవుడ్ హీరో అజిత్ కూడా ఇలాగే విజ్ఞప్తి చేశారు. తనను వేరే పేర్లతో పిలవొద్దని, అజిత్ కుమార్ లేదా అజిత్ అని పిలిస్తే చాలని అభిమానులను కోరారు.