Junaid Khan : నాన్న సూచనలను అసలు పట్టించుకోలేదు..
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్‌ఖాన్ గొప్ప నటుడే కాదు, గొప్ప నిర్మాత కూడా! ప్రయోగాలు చేయడంలో ముందుంటారు. లగాన్, దంగల్ సినిమాల్లో అమిర్ కాకుండా మరో నటుడుని ఊహించగలమా?
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్‌ఖాన్(Aamir Khan) గొప్ప నటుడే కాదు, గొప్ప నిర్మాత కూడా! ప్రయోగాలు చేయడంలో ముందుంటారు. లగాన్, దంగల్ సినిమాల్లో అమిర్ కాకుండా మరో నటుడుని ఊహించగలమా? అలాగే పీకే, గజని, త్రీ ఇడియట్స్, రంగ్ దే బసంతి , రాక్, దిల్, జో జీతాహై వహి సికందర్.. ఇలా బోల్డన్ని సినిమాలు అతడి ప్రతిభకు నిదర్శనాలు. అతడు చూడని విజయాలు లేవు. ప్రస్తుతం అమిర్ కొడుకు జునైద్ ఖాన్(Junaid Khan) కూడా హీరో అయ్యాడు. ఇటీవలవచ్చిన మహారాజ సినిమాతో తెరంగ్రేటం చేశాడు. ఆ సినిమా గురించి జునైద్ కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. సినిమాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న అమిర్ ఈ సినిమా చూసి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చాడట. కాకపోతే జునైద్ టీమ్ వాటిని అసలు పట్టించుకోలేదట! 'డైరెక్టర్ సిద్ధార్థ్ మల్హోత్రా ఓసారి స్క్రీన్ టెస్ట్ చేయాలని రా గలవా అని అడిగాడు. నేను వెళ్లాను. నన్ను మహారాజ సినిమాకు తీసుకున్నారు. బహుశా దర్శక నిర్మాతలకు నేను రొమాంటిక్ హీరోగా కనిపించలేదు కాబోలు. అందుకే ఇలాంటి కాన్సెప్ట్‌ను సెలెక్ట్ చేసుకున్నారు' అని జునైద్ ఖాన్ చెప్పుకొచ్చాడు. 'ఎందుకో తెలియదు కానీ ఈ సినిమాకు ముందు కొంత రాద్ధాంతం జరిగింది. ఈ సినిమా ద్వారా మేము ఎవరి మనోభావాలను దెబ్బ తీయాలని అనుకోలేదు. మహారాజ సినిమా(Maharaja Movie) గురించి నాన్నతో ఎక్కువగా చర్చించలేదు. ఆయన తన పనిలోనే ఎప్పుడూ బిజీగా ఉండాడు. పైగా ఇది ఆయన సినిమా కానే కాదు. అందుకే చర్చించలేదు. సినిమా పూర్తయ్యాక సిద్ధార్థ్ మల్హోత్రా, నిర్మాత ఆదిత్య చోప్రా నాన్నకు సినిమా చూపించారు. నాన్నకు సినిమా బాగా నచ్చింది. ఆయన కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు. వాటిలో కొన్ని సలహాలను పాటించాం. చాలా వాటిని లైట్ తీసుకున్నాం. మా సినిమాలో నాన్న జోక్యం అసలు లేదు. కాకపోతే మాకు ఏమైనా డౌట్ వస్తే మాత్రం చటుక్కుమని తీర్చేవారు' అని జునైద్ ఖాన్ అన్నాడు.