బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌ చేస్తున్న అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4(Unstopable) ఇవాళ్టి నుంచి మొదలవుతోంది.

బాలకృష్ణ(Balakrishna) హోస్ట్‌ చేస్తున్న అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4(Unstopable) ఇవాళ్టి నుంచి మొదలవుతోంది. ఈ టాక్‌ షోలో(Talk show) చంద్రబాబు(chandrababu) గెస్ట్‌గా రాబోతున్నారు. రాత్రి 8.30 గంటలకు ఆహాలో(Aha) స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ఈ షో చూసేందుకు తమకు సెలవు కావాలని ఐటీ ఉద్యోగులు(IT Employees) కోరుతున్నారు. హైటెక్ సిటీ రోడ్లుపై కొంద‌రు ఐటీ ఉద్యోగులు ప్లకార్డులతో హల్‌చల్ చేశారు. బాలయ్య పండుగ 25న‌ హాలిడే కావాలి అని ప్లకార్డులపై రాసి ఉంది. రాత్రి 8.30కు స్ట్రీమింగ్‌ అవుతున్న ఆ షోను చూసేందుకు సెలవు ఎందుకో అర్థం కావడం లేదంటున్నారు కొందరు. పైగా ఆ టాక్‌ షోను ఎప్పుడైనా చూడొచ్చు. ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న వాటికి ప్రత్యేకంగా టైమంటు ఉండదు.. ఇలా ప్ల కార్డులు పట్టుకుని రోడ్డు మీద నిల్చోవడం నలుగురి దృష్టిలో పడేందుకేనని కొందరు ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story