N Convention : నాగార్జున కు మద్దతుగా సినీ ఇండస్ట్రీ పెద్దలు!

తెలంగాణ ప్రభుత్వం నియమించిన హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది.

By :  Eha Tv
Update: 2024-08-25 05:04 GMT

తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) నియమించిన హైడ్రా(Hydra) (హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అస్సెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌) అక్రమ కట్టడాలను కూల్చివేస్తోంది. చెరువులు, కుంటలు, నానాలు ఆక్రమించి కట్టుకున్న నిర్మాణాలను నోటీసులు ఇవ్వకుండానే నేల మట్టం చేస్తోంది. నిన్నటికి నిన్న హీరో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)కు చెందిన ఎన్‌ -కన్వెన్షన్‌(N Convention)ను రెండు గంటల్లో పూర్తిగా నేలమట్టం చేసింది. తాను అంగుళం కూడా ఆక్రమించలేదని, పైగా కోర్టు స్టే ఇచ్చిందని నాగార్జున చెప్పుకొస్తున్నారు. ఇందుకు హైడ్రా కూడా తన వాదన వినిపించింది. మొత్తానికి నిన్నంతా మీడియాలో ఇదే హైలైట్‌గా నిలిచింది.

ఇదిలా ఉంటే నాగార్జున బిజినెస్‌ ప్రాపర్టీని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలు సీరియస్‌గా ఉన్నారట! ప్రభుత్వం తీరుతో అసంతృప్తిగా ఉన్న వారంతా ఒక బడా హీరో ఇంట్లో కలుసుకున్నారట! ఇందులో ఇండస్ట్రీ పెద్దలు, హీరోలు, నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. ఇలాంటి రాజకీయ, కక్ష సాధింపు చర్యలు సరైనవి కావని ఓ టాప్‌ హీరో తన అభిప్రాయం చెప్పారట! కావాలనే నాగార్జున ఎన్‌-కన్వెన్షన్‌ను కూల్చివేశారనే భావన ఇండస్ట్రీలో చాలా మందికి ఉన్నదట! బయటకు వీరు తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం లేదు కానీ ఇప్పుడేమిటీ చేయడం అన్న ఆలోచనలో ఉన్నారని టాక్‌! అలాగే నిన్న రాత్రి జరిగిన భేటీలో గద్దర్‌ సినీ అవార్డుపై కూడా చర్చ జరిగిందట! సినిమా రంగానికి సంబంధం లేని గద్దర్‌ పేరుతో అవార్డులు ఇవ్వడమేమిటని కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారట!

Tags:    

Similar News