Online Black Ticket : కల్కి టికెట్‌ కొంటున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి!

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రభాస్‌ కల్కి సినిమా మరికొద్ది గంటలలో థియేటర్లలో విడుదల కానుంది.

By :  Eha Tv
Update: 2024-06-26 06:46 GMT

ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రభాస్‌ కల్కి సినిమా(Prabhas Kalki Movie) మరికొద్ది గంటలలో థియేటర్లలో విడుదల కానుంది. సినిమాపై బోల్డన్ని అంచనాలు ఉండటంతో టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మొదటి రోజు మొదటి ఆట చూడాలన్న కోరిక అభిమానులకు చాలా ఉంటుంది. అందుకే ఎలాగైనా సరే ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో టికెట్‌ సంపాదించుకోవాలనుకుంటారు. అయితే చాలా మందికి మొదటి ఆటకు టికెట్ల దొరకడం లేదు. అది దొరక్కపోతే మొదటి రోజు ఏ ఆటకైనా సరే అనుకుంటున్నారు. అది కూడా కష్టంగానే ఉంది. ఫ్యాన్స్‌ బలహీనతను బాగానే క్యాష్‌ చేసుకుంటున్నారు బ్లాక్‌ రాయుళ్లు. అయితే బ్లాక్‌లో టికెట్లు కొంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే దెబ్బతినాల్సి వస్తుంది. ఇంతకు ముందులా బ్లాక్‌ టికెట్లను థియేటర్ల దగ్గర అమ్మడం లేదు. అప్పుడైతే థియేటర్ల దగ్గరే 50 రూపాయల టికెట్‌ 75 రూపాయలకు, వంద రూపాయల టికెట్‌ 150 రూపాయలకు బ్లాక్‌లో అమ్ముతుండేవారు. ఇప్పుడు ట్రెండ్‌ మారింది కదా! టెక్నాలజీ కూడా బాగా పెరిగింది కదా! అందుకే సోషల్‌ మీడియాలో బ్లాక్‌ టికెట్ల(Black Tickets)ను అమ్ముతున్నారు. అయితే ఇందులోనే చాలా మోసం ఉంటోంది. తమ దగ్గర టికెట్లు ఉన్నాయని, డబ్బులు పంపిస్తే టికెట్లు ఇస్తామని చెబుతున్నారు. ఆశపడి డబ్బులు పంపిన తర్వాత ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేస్తారు. మీరు ఎంత గుంజుకున్నా లాభం ఉండదు. డబ్బులు పోయినట్టే! అది అలా ఉంచితే, ఆన్‌లైన్‌ టికెట్‌ను మీకు ఎవరైనా అమ్మినా కొనేటప్పుడు బాగా చెక్‌ చేయండి. బార్‌ కోడ్‌ ఉన్న టికెట్‌ను మీకు అమ్మినట్టే మరొకరికి కూడా అమ్మే ఛాన్సుంది. ఉత్తి పుణ్యానికే డబ్బులు బొక్క! ఫస్ట్‌ డేనే చూడాలని ఏమీ లేదు. మొదటి రోజు కాకపోతే రెండు రోజైనా చూడొచ్చు. సినిమా ఎక్కడికి పోదు! డబ్బులు పోతే మళ్లీ దొరకవు.

Tags:    

Similar News