ఎక్కువగా పర్ఫామెన్స్ ఆధారిత పాత్రలపై దృష్టి
సౌత్ నుండి బాలీవుడ్లో ప్రవేశించి పెద్ద విజయం సాధించిన తాప్సీ పన్ను.
తెలుగు సినిమాల్లో గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన ఆమె, నార్త్‌లో మాత్రం ఎక్కువగా పర్ఫామెన్స్ ఆధారిత పాత్రలపై దృష్టి పెట్టారు.
ఇ మధ్య కాలంలో విజయాలలో కొంత వెనుకపడ్డారు తాప్సీ పన్ను, అయితే గ్లామర్ ఇమేజ్‌ని కాపాడుకుంటూ యాక్షన్ హీరోయిన్గా మంచి పేరు తెచ్చుకున్నారు.
ప్రతిసారీ అవకాశాలు వచ్చినప్పుడు యాక్షన్ పాత్రల్లో కూడా తన ప్రతిభ చూపేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు.
"బేబీ" సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన తాప్సీ, తర్వాత "నామ్ షబానా" చిత్రంలో కూడా అలాంటి పాత్రలో నటించారు.
ఇప్పుడు ఆమె తన లక్కీ జానర్‌ను మళ్లీ ఎంచుకుని, "గాంధారి" అనే సినిమాలో కిడ్నాప్ అయిన కూతుర్ని వెతుక్కునే తల్లి పాత్రలో కనిపిస్తున్నారు.
ఈ చిత్రంతో సక్సెస్ సాధించి మళ్లీ తన ఫామ్‌ను పునరుద్ధరించడానికి ఆమె కష్టపడుతున్నారు.