Actress Anasuya : నాలుగేళ్ల కిందటి వీడియో అది.. .. నెటిజన్‌పై అనసూయ ఫైర్‌

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయకు మళ్లీ కోపం వచ్చింది. తనను ఎవరైనా ఏమైనా అంటే ఆమె ఊరుకునే టైప్‌ కాదు కదా! అంతకు రెండింతలు అంటుంది.

By :  Eha Tv
Update: 2024-07-15 11:30 GMT

ప్రముఖ యాంకర్‌, నటి అనసూయకు మళ్లీ కోపం వచ్చింది. తనను ఎవరైనా ఏమైనా అంటే ఆమె ఊరుకునే టైప్‌ కాదు కదా! అంతకు రెండింతలు అంటుంది. సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్‌ ఫోటోలను, తాజా విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటుంది. లేటెస్ట్‌గా ఓ టీవీ షోలో అనుసూయ చేసిన డాన్స్‌కు సంబంధించిన ఓ వీడియోను నెటిజన్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్ట్‌ చేశారు. ఇది చూసిన మరో వ్యక్తి ట్రోల్‌ చేశాడు. దీనికి అనసూయ రియాక్టవ్వక తప్పలేదు. ఇకపై దేనికి స్పందించకూడదని అనుకున్నానంటూ అనసూయ చెబుతూ ఓ మహానటికి నివాళులు అర్పించిన తన వీడియోను అవమానించడం సరికాదని కోపగించుకున్నారు.

అనసూయ ఎక్స్‌లో ఏం రాసుకొచ్చారంటే 'నేను దేనికీ స్పందించకూడదని నిర్ణయించుకున్నా. కానీ నాలుగేళ్ల క్రితం ఒక ఛానెల్‌లో జరిగిన ఒక పండుగ కార్యక్రమంలో మహానటి సావిత్రమ్మకు నివాళులు అర్పించాను. నా ప్రదర్శన పట్ల నాకు గౌరవంగా భావిస్తున్నా. కానీ మీరు ఇలా అవమానకరమైన రీతిలో ట్రోల్ చేయడం మంచిది కాదు. ఏదైనా నా గురించి గౌరవప్రదమైన విమర్శలు చేస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ ఇది మహానటి సావిత్రిమ్మకు నివాళిని ఉద్దేశించి ఇలా చేయడం అగౌరవంగా అనిపిస్తోంది. దయచేసి ఆ ఈవెంట్‌లో నా పూర్తి ప్రదర్శనను చూసి ఆపై జడ్జ్‌ చేయమని సూచిస్తున్నా. కావాలంటే ఈ ప్రోగ్రామ్ జీ5లో అందుబాటులో ఉంది. ఇక్కడ నా నటన మీకు నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు. కనీసం లెజెండ్ అయినా సావిత్రమ్మ కోసమైనా ఇలాంటి ట్రోల్స్‌ చేయకండి. ఎప్పటిలాగే నాపై విమర్శలు చేయాలనుకుంటే చేసుకోండి' అంటూ చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News