టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై(jani master) లైంగిక వేధింపుల(Sexual assault) కేసు నమోదు

టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌పై(jani master) లైంగిక వేధింపుల(Sexual assault) కేసు నమోదు కావడంతో సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది అతగాడి వ్యవహారంపై రియాక్టవుతున్నారు. జానీ మాస్టర్‌ అలియాస్‌ షేక్‌ జానీ బాషా తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అతడి అసిస్టెంట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాధితురాలకు న్యాయం జరగాలంటూ చాలా మంది ప్రముఖులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే నటి పూనమ్‌ కౌర్‌(Poonam kaur), గాయని చిన్మయి శ్రీపాదతో(chinmayi sripada) పాటు టాలీవుడ్‌కు చెందిన నటీనటులు బాధితురాలికి బాసటగా నిలిచారు. లేటెస్ట్‌గా యాంకర్‌, నటి అనుసూయ భరద్వాజ్‌(Anasuya bharadwaj) కూడా అమెకు సపోర్టిచ్చారు. లేడి కొరియోగ్రాఫర్‌కు జరిగిన అన్యాయం పట్ల అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలో ఎవరికైనా ఇలాంటి లైంగిక వేధింపులు ఎదురైతే భయపడకుండా వాటిని బయటపెట్టాలని అనసూయ అన్నారు. మహిళలకు అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం, స్థయిర్యం ఉండాలని అనసూయ చెప్పారు.

'మీకే కాదు మీకు తెలిసిన వాళ్లకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురైతే వెంటనే బయటపెట్టండి. మీకు అండగా అందరూ నిలుస్తారు. బాధితురాలితో నేను కూడా కలిసి పని చేశాను. పుష్ప సెట్స్‌లో రెండు మూడు సార్లు ఆ అమ్మాయిని చూశాను. తను చాలా టాలెంటెడ్‌. ఇలాంటి క్లిష పరిస్థితులు ఆ అమ్మాయి టాలెంట్‌ను ఏమాత్రం తగ్గించలేవు' అంటూ అననూయ బాధితురాలికి ధైర్యం ఇచ్చారు. 'మనసులో దాచుకొని బాధపడడం వల్ల ఎలాంటి లాభం లేదు. నేను పనిచేసే చోట మహిళలకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందిస్తాను. ఈ వ్యవహారంలో కూడా బాధితురాలికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. ఇందుకోసం సపోర్టుగా ఉన్న ఫిలిం ఛాంబర్ తో పాటు ఓడబ్ల్యు సభ్యులకు కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో ఇండస్ట్రీలో ఏ మహిళకు ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకూడదని కోరుకుంటున్నాను’అని అనసూయ సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ఇదిలా ఉంటే జానీ మాస్టర్‌ కోసం నార్సింగ్‌ పోలీసలు గాలిస్తున్నారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.

Eha Tv

Eha Tv

Next Story