ఇది మోలీ కోచన్ అనే మహిళ కథ, తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత తన జీవితంలో కొత్త అనుభూతులు పొందాలనుకుంది.

ఇది మోలీ కోచన్ అనే మహిళ కథ, తన భర్తకు విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత తన జీవితంలో కొత్త అనుభూతులు పొందాలనుకుంది. అందుకు ఆమె 200 మందితో సెక్స్‌లో పాల్గొంది. కానీ దీని వెనుక విషాదగాథ ఉంది. మోలీ కోచన్‌(molly Kochan)కు 2015లో బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోస్(Breast Cancer Diagnosis) అయింది, అది టెర్మినల్ స్టేజ్‌లో ఉందని తెలిసింది అంటే, చికిత్సతో కూడా కోలుకునే అవకాశం చాలా తక్కు. ఈ వార్త ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ సమయంలో ఆమె తన భర్తతో సంబంధంలో సమస్యలు ఎదుర్కొంటోంది. క్యాన్సర్ డయాగ్నోసిస్(Cancer Diagnosis) తర్వాత, మోలీ తన భర్తను విడిచిపెట్టి, తన మిగిలిన జీవితాన్ని తన ఇష్టాలకు అనుగుణంగా జీవించాలని నిర్ణయించుకుంది. ఆమె తన లైంగిక స్వేచ్ఛను అన్వేషించాలని, జీవితంలో కొత్త అనుభవాలను పొందాలని భావించింది. ఈ క్రమంలో ఆమె సుమారు 200 మంది పురుషులతో సెక్స్‌లో పాల్గొన్నది.

న్యూయార్క్(new york) సిటీలోని అప్పర్ వెస్ట్ సైడ్‌లో పెరిగింది. చిన్నప్పటి నుంచి రైటర్ కావాలని కలలు కన్నది. లాస్ ఏంజిల్స్‌కు వెళ్లి, ఓ వ్యక్తిని ప్రేమించి, నిశ్చితార్థం చేసుకుంది. తర్వాత న్యూయార్క్‌లోని ది న్యూ స్కూల్ నుంచి క్రియేటివ్ రైటింగ్‌లో MFA పూర్తి చేసింది. ఆ తర్వాత మళ్లీ లాస్ ఏంజిల్స్‌లోని సిల్వర్ లేక్‌కు వెళ్లి వివాహం చేసుకుంది. మోలీ స్థిరత్వం, నియంత్రణ కోరుకునే వ్యక్తి. కానీ, ఆమె బాల్యంలో తన తల్లి బాయ్‌ఫ్రెండ్ చేత 7 ఏళ్ల వయసులో లైంగిక వేధింపులకు గురైంది. ఆమె జీవితంపై ప్రభావం చూపింది. 2005లో, 33 ఏళ్ల వయసులో, మోలీ తన రొమ్ములో గడ్డను గుర్తించి డాక్టర్‌ను సంప్రదించింది. కానీ డాక్టర్‌ దానిని తేలిగ్గా తీసేశాడు. 2011లో, ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆమె కీమోథెరపీ(Chemotherapy), రేడియేషన్, డబుల్ మాస్టెక్టమీ రెండు రొమ్ముల తొలగింపు, బ్రెస్ట్ రీకన్‌స్ట్రక్షన్ సర్జరీలు చేయించుకుంది. 2015లో, మోలీకి హిప్ నొప్పి మొదలైంది. బయాప్సీలో క్యాన్సర్ తిరిగి వచ్చినట్లు, ఇప్పుడు స్టేజ్ IV మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్‌గా ఎముకలు, కాలేయం, మెదడుకు వ్యాపించినట్లు తేలింది. ఇది టెర్మినల్—అంటే, కొన్ని సంవత్సరాలు మాత్రమే జీవించే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. మోలీ భర్తతో 15 ఏళ్ల వివాహం సమస్యాత్మకంగా మారింది. ముఖ్యంగా సెక్స్ విషయంలో. ఆమె భర్త క్యాన్సర్ సమయంలో సపోర్ట్ చేసినా లైంగికంగా దూరమయ్యారు. తాను తన జీవితాన్ని ఇష్టంగా జీవించాలని భావించి 2016లో ఆమె విడాకులు తీసుకుంది. ఆమె భర్త ఆమె నిర్ణయాన్ని గౌరవించి విడాకులు ఇచ్చాడు. ఆమె ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లలో చాట్ చేయడం మొదలుపెట్టి, వివిధ పురుషులతో సంబంధాలు పెట్టుకుంది. సుమారు 200 మందితో సెక్స్‌లో పాల్గొన్నది ఆమె స్నేహితురాలు చెప్పింది. మోలీ మార్చి 8, 2019న, 45 ఏళ్ల వయసులో మరణించింది.

ehatv

ehatv

Next Story